Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.
Weather Update (imagecredit:twitter)
Telangana News

Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ వెల్లడి!

Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. (ఐఎండి) బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని అది కొన్ని గంటలలోనే తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఉందని వాతవరణ శాఖ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

జూన్ నెలలో భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఇది దీర్ఘకాలిక సగటులో 108 శాతం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది 16 సంవత్సరాలలో తొలిసారి అని వెల్లడించింది. ఈసారి రుతుపవనాల కోర్ జోన్‌లో చురుకుగా కదులు తున్నాయని తెలిపింది. రుతుపవనాలు భారతదేశానికి చాలా ప్రత్యేకమైనవి ఎందుకంటే జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురిసే ఈ రుతుపవనాల వర్షం దేశంలోని వార్షిక వర్షపాతంలో 70% ఉంటుంది. దీంతో దేశ నీటి అవసరాలు ఎక్కువగా ఈ వర్షం ద్వారానే తీరుతాయి. భారతదేశంలోని వ్యవసాయ భూమిలో 60% నీటిపారుదల కోసం రుతుపవనాలపై ఆధారపడి రైతులు పనిచేస్తారు. వరి, మొక్కజొన్న, మినుము, రాగి, అర్హార్ వంటి ఖరీఫ్ పంటలు నైరుతి రుతుపవనాలపై ఆధారపడి పనిచేస్తుంటారు.

Also Read: Hydra Survey: హైడ్రా సంచలన నిర్ణయం.. జీహెచ్ఎంసీ నుండి ఔటర్ వరకు సర్వే!

తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశ ఉందని తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో 5 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ వాతవరణ శాణ జారీ చేసింది. 15 జిల్లాలకు ఐఎండి ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇక, ఆంద్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా, మన్యం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచనను వాతావరణ శాఖ జారీచేసింది. ఈ నెల 31 వరకు మత్స్యకారులు వేటకు ఎవరు వెళ్లొద్దని హెచ్చరికలను జారీచేసింది.

Also Read: Central on Kharif Crops: అన్నదాతకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా పంట మద్దతు ధరలు పెంపు

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..