Telangana Politics (imagecredit:twitter)
Politics

Telangana Politics: స్థానిక ఎన్నికల్లో పట్టుకోసం విశ్వ ప్రయత్నాలు.. క్యాడర్ కోసం పక్కా ప్లాన్?

 Telangana Politics: తెలంగాణలో రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చాక చక్యంగా రాజకీయంగా పావులు కదుపుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. వచ్చిన ఆరోపణలను డైవర్షన్ చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఒకరిపై ఒకరు పై చెయ్యి సాధించేందుకు పోటీపడుతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు రానుండటంతో విమర్శలకు పదును పెట్టారు. కేడర్ చేజారకుండా పార్టీకి నష్టం జరుగకుండా పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో ఈ రెండుపార్టీలు తప్ప మరోపార్టీ లేదని ప్రజల్లోకి బలంగా వెళ్లాలని భావిస్తున్నట్లు ప్రస్తుత రాజకీయ పరిణామాలే అందుకు నిదర్శనం.

రాష్ట్రంలో ఎన్నికలు జరుగడం లేదు.. కానీ రాజకీయ వేడి మాత్రం ఊపందుకుంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగబోతున్నాయని భావించి ఇప్పటికే రాజకీయ అస్త్రాలకు పదును పెట్టారు. కేడర్ లో దృష్టిని పార్టీవైపునకు మళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డీ అంటే డీ అంటున్నాయి. విమర్శలు చేస్తే వెంటనే ప్రతివిమర్శలు చేస్తున్నారు. నిత్యం మీడియాలో ఉండేలా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలా? లేకుంటే ప్రత్యర్థి పార్టీలను బలహీనపర్చడంలో భాగంగానే వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది.

కాంగ్రెస్ ఆరోపణలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా కమిషన్ ఈ నెల 20న నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై విస్తృతంగా చర్చజరుగుతుంది. బీఆర్ఎస్ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిందని ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. ఈతరుణంలో పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావించి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ నెల 22న వరంగల్ సభను విశ్లేషిస్తూ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖను బయటకు తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు కవిత ఈ నెల 23న అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు వచ్చిన కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టులో కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని..కోవర్టులు ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 24న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మీడియా మొత్తం బీఆర్ఎస్ పైనే దృష్టిసారించింది. ఒక్కసారిగా బీఆర్ఎస్ లో ఏంజరుగుతుందనేది ప్రజలంతా ఆసక్తిగా చర్చించుకునే పరిస్థితిని తీసుకొచ్చారు.

రాజకీయాల్లో హాట్ టాపిక్!

25న ఫాం హౌజ్ లో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. కవిత ఎపిసోడ్ తాజారాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 26న కవితతో దామోదర్ రావు భేటీ కావడం, చర్చించడం చర్చకు దారితీసింది. ఫార్మూలా ఈ రేసు కేసులో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 28న హాజరుకావాలని నోటీసులో పేర్కొనడంతో అమెరికాకు వెళ్తున్నట్లు కేటీఆర్ రిప్లై ఇచ్చారు. 27న కాళేశ్వరం విచారణకు కేసీఆర్ హాజరవుతున్నట్లు పార్టీ లీకులు ఇచ్చింది. అంతేకాదు కవిత.. సింగరేణి జాగృతిని ఆవిర్భావాన్ని ప్రకటించారు. 28న కేసీఆర్ తో హరీష్ రావు భేటీ కావడం తీవ్రచర్చకు దారితీసింది. బీఆర్ఎస్ కు మైలేజ్ వచ్చేలా పక్కా ప్రణాళికలతో ముందుకువెళ్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Also Read; Central on Kharif Crops: అన్నదాతకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా పంట మద్దతు ధరలు పెంపు

మంత్రి వర్గ విస్తరణ కోసం సీఎం ఢిల్లీ

ఇక కాంగ్రెస్ పార్టీ సైతం దూకుడు పెంచింది. కాళేశ్వరం కమిషన్ గడువును పెంచడంతో ఈ కమిషన్ కేసీఆర్ హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో నోటీసులు ఇప్పించి అటెన్షన్ డైవర్షన్ చేసిందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ విమర్శల స్పీడ్ పెంచడంతో జహీరాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి తనదైనశైలీలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ నెల 23న మంత్రి వర్గ విస్తరణ కోసం సీఎం ఢిల్లీకి వెళ్తున్నట్లు లీకులు ఇచ్చారు. 25న నీతి అయోగ్ సమావేశంలోని పాల్గొనడంతో పాటు కేసీతో భేటీ అయ్యారు. మంత్రి వర్గ విస్తరణ, పార్టీ పదవులుకోసం చర్చలు జరిపారు. అయితే ఎవరికి పదవులు వస్తాయనే దానిపై ప్రజల దృష్టిని మరల్చారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలకు పదును పెట్టారు.

సీఎం హెచ్చరికలు జారీ

కేసీఆర్ కుటుంబంలో చీలికలు వస్తున్నాయని, కవిత పార్టీ పెడుతున్నారని ఆరోపణలు చేశారు. 27న పార్టీపై ఎవరైనా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే కటకటాల పాలవుతారని సీఎం హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఢిల్లీకి ప్రతి సారి హైకమాండ్ పిలుస్తుందని పార్టీ పదవుల్లో, కేబినెట్ విస్తరణ నిర్ణయాల్లో జాప్యంపై పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఇదే అంశాన్ని బహిరంగంగా నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటంతో పార్టీలో ఏంజరుగుతుందోనని ప్రజల్లోనూ, పార్టీ కేడర్ లోనూ చర్చకు దారి తీశారు. కాంగ్రెస్ పై ప్రజల్లో చర్చజరిగేదానిపై దృష్టిసారించారు. మరోవైపు యువవికాసం యూనిట్లు జూన్ 2న పంపిణీ చేస్తామని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. యువత దృష్టిని ప్రభుత్వంపై మళ్లించే చర్యలు చేపట్టారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ మీనాక్షినటరాజ్ పార్టీ నేతలతో సమావేశాలు హాట్ టాపిక్ అయ్యాయి.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటా పోటీ

రెండుపార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలతో ముందుకు సాగుతున్నాయి. త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టుకోసమే ఇప్పటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీపడి విమర్శలకు పదునుపెట్టాయనేది స్పష్టమవుతోంది. ప్రభుత్వం చేసే విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వకపోతే బీఆర్ఎస్ కేడర్ చేజారుతుందని, బీఆర్ఎస్ చేసే వాటిని తిప్పికొట్టకపోతే కాంగ్రెస్ కేడర్ చేజారే అవకాశం ఉందని భావించే రెండు పార్టీల నేతలు స్పందిస్తూ కౌంటర్లు ఇస్తున్నాయి. పార్టీ కేడర్ లోనూ జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నాయి. నేతలను, కేడర్ ను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఆరోపణలు, ప్రత్యారోపణలకు పదును పెట్టాయి. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వేడిని పెంచాయి.

Also Read: Hyderabad Blast Conspiracy: సిరాజ్ కేసులో సంచలనాలు.. స్వర్గంలో చోటు దొరుకుతుందని చెప్పి!

 

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?