Sambarala Yetigattu: మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘సంబరాల యేటిగట్టు (SYG)’. ఈ సినిమాతో తన కెరీర్‌ను న్యూ హిట్స్‌కి తీసుకెళ్లడానికి తేజ్ సిద్ధమవుతున్నారు. ఈ గ్రిట్టీ, ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఎలక్ట్రిఫైయింగ్ గ్లింప్స్‌తో ఇప్పటికే భారీ బజ్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. నూతన దర్శకుడు రోహిత్ కెపి (Rohith KP) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని, బ్లాక్‌బస్టర్ చిత్రం ‘హను-మాన్’ (Hanu Man) భారీ విజయం తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ (Primeshow Entertainment) బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.
Also Read- Hombale Films: సూపర్ స్టార్‌తో సినిమా సెట్ చేసిన హోంబలే ఫిల్మ్స్.. ఇది వేరే లెవల్!
వారిచ్చిన అప్డేట్ ప్రకారం.. కంటెంట్, స్కేల్ రెండింటిలోనూ అత్యున్నత స్థాయిలో దూసుకుపోతున్న ఈ సినిమా, ఇప్పుడు ఒక ముఖ్యమైన మైల్ స్టోన్‌ని చేరుకుంది. ఈ చిత్రం 120 రోజుల షూటింగ్‌ను విజయవంతంగా ముగించుకుని, దాదాపు 75 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సక్సెస్ ఫుల్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తోంది. ప్రస్తుతం, ఈ సినిమా షూటింగ్ కోసం టీం మూడు భారీ సెట్‌లను నిర్మిస్తున్నారని, ఇవి నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్‌కు కీలకమైన బ్యాక్ డ్రాప్స్‌గా వుంటాయని టీమ్ తెలిపింది. ఈ సెట్స్‌లో కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని, ఇవి సినిమాలో విజువల్స్ పరంగా అద్భుతంగా, కథనం పరంగా మోస్ట్ ఎక్జయిటింగ్‌గా వుండబోతున్నాయని టీమ్ ఈ అప్డేట్‌లో వెల్లడించింది.
Also Read- Sandeep Reddy Vanga: బాలీవుడ్‌ను ‘వంగ’ బెడుతున్నాడుగా!
‘సంబరాల యేటిగట్టు’లో సాయి దుర్గ తేజ్ ఇప్పటి వరకు కనిపించని న్యూ అవతార్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో అతని పాత్ర ఇప్పటివరకు అతని కెరీర్‌లో మోస్ట్ పవర్ ఫుల్, ఎమోషన్స్ పరంగా అద్భుతంగా వుండబోతోందనేది ఇప్పటికే విడుదలై ఎలక్ట్రిఫైయింగ్ గ్లింప్స్ చెప్పకనే చెప్పేసింది. ఇందులోని పాత్ర కోసం తేజ్ కంప్లీట్‌గా మేకోవర్ అయిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఈ పవర్ ఫుల్ గ్రిప్పింగ్ కథ కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతగానో వేచి చూస్తున్నారు. భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే అఫీషియల్‌గా నటీనటులని అనౌన్స్ చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా, సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సినిమాటోగ్రఫీ వెట్రి పళనిసామి, సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్, నవీన్ విజయ కృష్ణ ఎడిటర్, గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో 2025 సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
