Hombale Films:
ఎంటర్‌టైన్మెంట్

Hombale Films: సూపర్ స్టార్‌తో సినిమా సెట్ చేసిన హోంబలే ఫిల్మ్స్.. ఇది వేరే లెవల్!

Hombale Films: భారీ సినిమాలకు, భారీ తనానికి పెట్టింది పేరు హోంబలే ఫిల్మ్స్. ఇప్పటి వరకు ఈ సంస్థ నుంచి సినిమా వస్తుందీ అంటే మ్యాగ్జిమమ్ ఉంటుందనేలా క్రెడిబిలిటీని పెంచుకున్న ఈ బ్యానర్ నుంచి.. ఇప్పుడు ఇంకో స్టెప్ ముందుకు పడింది. అవును కన్నడ సినీ ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారిన ఈ బ్యానర్ ఇప్పటికే టాలీవుడ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌తో మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ నుంచి తమ పరిధిని బాలీవుడ్‌కు విస్తరిస్తున్నారు. తాజాగా అసలు ఊహించని కాంబోలో మూవీని ప్రకటించిందీ సంస్థ. అంతే, ఒక్కసారిగా హోంబల్ ఫిల్మ్స్ బ్యానర్ ట్రెండ్ బద్దలు కొడుతోంది. ఆ కాంబో వివరాల్లోకి వెళితే..

Also Read- Sandeep Reddy Vanga: బాలీవుడ్‌ను ‘వంగ’ బెడుతున్నాడుగా!

భారతీయ సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటిగా హోంబలే ఫిల్మ్స్ దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే సూపర్ మాస్ హిట్ చిత్రాలతో న్యూ హైట్స్‌ని క్రియేట్ చేసింది. అలాంటి హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి పని చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇది హృతిక్ రోషన్ అభిమానులకూ, సినిమా ప్రేమికులకూ బిగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. హోంబలే ఫిల్మ్స్ ‘కేజీఎఫ్ చాప్టర్ 1 అండ్ 2’, ‘సలార్: పార్ట్ 1 సీస్‌ఫైర్’, ‘కాంతార’ వంటి పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. ఇండియన్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లో ఒకటిగా నిలిచింది. బాక్సాఫీస్ విజయాల్లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పింది. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న సినిమాలన్నీ భారీ చిత్రాలే కావడం విశేషం. ఇప్పుడు మరో భారీ చిత్రం, అసలు ఎవరూ ఊహించని కాంబోని హోంబల్ సెట్ చేసి, అందరినీ ఆశ్చర్యపరిచింది.

Also Read- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’లో హీరోయిన్ నేనే.. కట్టప్ప ఇలా షాకిచ్చాడేంటి?

ఈ సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. ఈ కాంబినేషన్‌ సెట్ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. హోంబలే ఫిల్మ్స్‌లో మేము స్ఫూర్తిదాయకమైన కథలను చెప్పాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. హృతిక్ రోషన్‌తో ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించాలన్న లక్ష్యాన్ని సాకారం చేస్తామనే నమ్మకంతో ఉన్నాం. ఈ కాంబో ఎప్పటికీ గుర్తుండిపోయేలా వుంటుందని చెప్పారు. హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. హోంబలే ఫిల్మ్స్ అనేక వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తున్న సంస్థ. వారితో కలిసి పని చేయబోతున్నందుకు నాకు ఎంతో ఉత్సాహంగానూ, సంతోషంగానూ ఉంది. మేము పెద్ద కలలు కంటున్నాం. ఆ కలల్ని నిజం చేసేందుకు పూర్తిగా అంకితభావంతో పని చేస్తామని తెలిపారు.

హృతిక్ రోషన్ విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా మ్యాసీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఆయనొకరు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, మాగ్నటిక్ పెర్ఫార్మెన్స్ ఎన్నో బ్లాక్‌బస్టర్‌లను అందించాయి. ఆయన రాబోయే సినిమాలు ‘వార్ 2’, ‘క్రిష్ 4’లపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ