Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) చారిత్రాత్మక యోధుడిగా నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో హీరోయిన్‌ని నేనే అంటూ ‘కట్టప్ప’ సత్యరాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ నిధి అగర్వాల్ కదా.. మరి సత్యరాజ్ ఇలా అన్నాడేంటి? అని ఆశ్చర్యపోతున్నారు కదా! అసలాయన ఎందుకు, ఎక్కడ ఈ పదాన్ని వాడారో తెలుసుకునేముందు.. నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకుని.. సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేర్చాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘తార తార’ అనే పాటను చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.
Also Read- Kannappa Song: మంచు విష్ణు కుమార్తెలు పాడిన పాట వదిలారు.. ఎలా ఉందంటే?
‘తార తార’ పాట విషయానికి వస్తే.. ‘తార తార’ సాంగ్ మనసుని హత్తుకునేలా శ్రావ్యంగా ఉంది. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్‌పై చిత్రీకరించిన ఈ పాట వెండితెరపై ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. ఇద్దరి జోడి చూడటానికి ఎంతో అందంగా ఉంది. ఈ లిరికల్ వీడియోలో భారీతనం కనిపిస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం, శ్రీ హర్ష సాహిత్యం.. లిప్సిక భాష్యం, ఆదిత్య అయ్యంగార్ ఓకల్స్ అన్నీ కూడా ఈ పాటని అగ్ర స్థాయికి చేర్చుతున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మాధ్యమాలలో అలాగే యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పలు గొప్ప తెలుగు సినిమాలను తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాను. అలాగే పలు తమిళ సినిమాలను తెలుగులో ప్రేక్షకులకు అందించాను. ముఖ్యంగా ‘ఇండియన్’ చిత్రం నిర్మాతగా నాకు ఎంతో పేరు తీసుకొచ్చింది. సినిమా ద్వారా వినోదంతో పాటు, ఏదో ఒక సందేశం ఇవ్వాలనేది నా తపన. 90 శాతానికి పైగా నేను నిర్మించిన సినిమాలు విజయం సాధించాయి. నా కుమారుడు జ్యోతికృష్ణ పాన్ ఇండియా చిత్రమైన ‘హరి హర వీరమల్లు’ బాధ్యతను క్రిష్ దగ్గర నుంచి తీసుకొని, సినిమా అద్భుతంగా రావడంలో కీలక పాత్ర పోషించాడు. ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఈ సినిమాని రూపొందించాము. కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమా కోసం ఐదేళ్లు వెచ్చించిన నిధి అగర్వాల్‌కి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పాట మీ అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నానని తెలిపారు.
Also Read- Rajendra Prasad: ఇప్పుడున్నంత డిస్టర్బెన్స్ అప్పట్లో లేదు.. పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యింది అందుకే!
ప్రముఖ నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ. తమిళ వారికి ఎంజీఆర్ ఎలాగో.. తెలుగు వారికి ఎన్టీఆర్ అలా. అలాంటి గొప్ప వ్యక్తి జయంతి రోజున ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. తండ్రిని మించిన తనయుడు అంటారు కదా, ఎ.ఎం. రత్నం తనయుడు జ్యోతి కృష్ణ అలాంటి వాడే. అతని ప్రతిభ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని, జ్యోతి కృష్ణ గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఇందులో హీరోయిన్ నిధి అగర్వాల్ కాదు.. నేను(నవ్వుతూ). హీరోయిన్‌ని హీరో కాపాడతాడు కదా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నన్ను కాపాడతారు. అందుకే నా పాత్ర హీరోయిన్ పాత్ర లాంటిది అని చెబుతున్నాను. ఇంత గొప్ప చిత్రంలో నేను కూడా భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యకమంలో ప్రసంగించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు