Kannappa Song: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి మరో పాట విడుదలైంది. ఈ పాటకు ఓ స్పెషల్ ఉంది. ఈ పాటను స్వయంగా మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా (Ariana and Viviana) ఆలపించారు. జూన్ 28న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రమోషన్స్‌ని మేకర్స్ ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. వారం వారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ, ఇతర స్టేట్స్‌లో పబ్లిక్ ఈవెంట్స్ నిర్వహిస్తూ.. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు విష్ణు మంచు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై అంచనాలను పెంచేయగా.. తాజాగా ఈ లిస్ట్‌లో మరో పాటను చేర్చారు మేకర్స్. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Rajendra Prasad: ఇప్పుడున్నంత డిస్టర్బెన్స్ అప్పట్లో లేదు.. పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యింది అందుకే!
మోహన్ బాబు (M Mohan Babu) మనవరాళ్లు, విష్ణు మంచు (Vishnu Manchu) కుమార్తెలు అరియానా, వివియానా పాడిన ‘శ్రీకాళ హస్తి’ పాటను విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతీ పాట పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అరియానా, వివియానా పాడిన ఈ పాటను బుధవారం కాశీ విశ్వనాథ ఆలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మంచు మోహన్ బాబు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, రచయితలు తోట ప్రసాద్, ఆకుల శివ, అర్పిత్ రాంకా వంటి వారంతా పాల్గొన్నారు. స్టీఫెన్ దేవస్సీ స్వరపరిచిన ఈ పాట భక్తి, భావోద్వేగాలను ప్రతిబింబించేలా ఉండగా.. ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ పాటకు సాహిత్యం అందిచారు. ఈ సాహిత్యాన్ని గమనిస్తే.. శ్రీ కాళ హస్తి దైవిక వారసత్వాన్ని ఎంతో అందంగా వివరిస్తుందీ పాట. వినగానే అందరినీ ఆధ్యాత్మిక మూడ్‌లోకి తీసుకెళుతున్న ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
Also Read- CM Chandrababu Warning: చంద్రబాబు ఉగ్రరూపం.. వారికి అదే చివరి రోజు.. పెద్ద వార్నింగే!
విష్ణు మంచు కుమార్తెలైన అరియానా, వివియానా ఈ పాటకు ప్రాణం పోస్తూ.. ప్రతీ ఒక్కరి హృదయాలను తాకేలా ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియోలో అరియానా, వివియానా కనిపించిన విజువల్స్ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించిన ఓ విజువల్ వండర్‌గా ఈ పాట అందరినీ మెప్పిస్తోంది. ఈ పాట రాబోయే తరాలకు ‘శ్రీ కాళ హస్తి’ ఆలయ విశిష్టతకు చిహ్నంగా ఉంటుందనడంలో అస్సలు అతిశయోక్తి లేనే లేదు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై డా. మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శివయ్యగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ అగర్వాల్, రుద్రుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు.. ఇంకా మోహన్ లాల్, శరత్ కుమార్ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు.. ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు