CM Chandrababu Warning (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

CM Chandrababu Warning: చంద్రబాబు ఉగ్రరూపం.. వారికి అదే చివరి రోజు.. పెద్ద వార్నింగే!

CM Chandrababu Warning: కడప వేదికగా టీడీపీ మహానాడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండో రోజు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో తనలాంటి నాయకుడ్నే మోసం చేయగలిగారని సీఎం చంద్రబాబు అన్నారు. తొలుత గుండెపోటుతో ఆయన చనిపోయారని ప్రచారం చేశారని.. అందిరిలాగే తానూ నమ్మానని చెప్పారు. ఎన్నికల హడావీడిలో పడి దానిని పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. సాయంత్రానికి అసలు విషయం తెలిసిందని చెప్పారు. రెండో రోజున వారి పత్రికల్లోనే నారా సుర రక్త చరిత్ర అని రాసుకొచ్చారని చంద్రబాబు మండిపడ్డారు.

కోవర్టులతో జాగ్రత్త
టీడీపీలో కోవర్టులు ఉన్నారని మహానాడు వేదికగా చంద్రబాబు స్పష్టం చేశారు. సంతనూతలపాడులో వీరయ్య చౌదరి, పల్నాడులో జంట హత్యలు జరిగితే తనకు అనుమానం వచ్చిందని చెప్పారు. కొందరు మన దగ్గర ఉంటూ మన వేలితో మన కంటినే పొడుచుకునేలా చేస్తున్నారని అన్నారు. దీని ద్వారా తెలుగుదేశం వారు.. వారి పార్టీ మనుషుల్నే చంపుకుంటున్నారని చెడ్డపేరు తెస్తున్నారని అన్నారు. ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి తప్పుడు పనులు చేసే ఏ కార్యకర్తను తాను ఉపేక్షించనని హెచ్చిరించారు.

వలస పక్షులు వస్తాయి.. పోతాయి
నేరస్తులూ.. ఖబడ్దార్ అంటూ మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. తన దగ్గర మీ ఆటలు సాగవని.. ఇది హెచ్చరిక అంటూ చెప్పారు. కోవర్డులను తమ వద్దకు పంపి.. వారి ద్వారా అజెండా‌ను నెరవేర్చుకోవాలనుకుంటే ఆ విషయాలను కూడా ఇక నుంచి పసిగడతామని అన్నారు. కోవర్డుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. వలసలు పక్షులు వస్తాయి.. పోతాయని నిజమైన కార్యకర్త మాత్రం పార్టీలోనే ఉంటారని స్పష్టం చేశారు. పార్టీ బలోతం కావాలని.. అదే సమయంలో కోవర్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

ఆడబిడ్డలకు భరోసా
రెండో రోజు మహానాడు సభలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికే దీపం పథకం కింద ఆడబిడ్డలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నట్లు సీఎం గుర్తు చేశారు. డ్వాక్రా సంఘాలు పెట్టి సాధికారతతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. మహానాడులో మగవారితో సమానంగా ఆడబిడ్డలు లేరని.. కానీ ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మగవారితో సమానంగా ఆడవాళ్లు ఉండాలన్నదే తన సంకల్పమని చెప్పారు. మరోవైపు సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారం చేస్తే సంహించనని అన్నారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజు అవుతందని హెచ్చరించారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు