Sr NTR Birth Anniversary: దివంగత నందమూరి తారక రామారావు (NTR) 102వ జయంతి (102nd Birth Anniversary) సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandra Babu) ఘన నివాళులు అర్పించారు. రెండోరోజు మహానాడు కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూల మాల వేసి అంజలి ఘటించారు. తెలుగు ప్రజల కోసం సీనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించేందుకు ఆయన అహర్నిశలు శ్రమించారని చంద్రబాబు కొనియాడారు.
‘సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు’ అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. తెలుగింటి మహిళలకు అన్నగా మారి ఆస్తి హక్కు కల్పించారని పేర్కొన్నారు. పక్కా ఇళ్ల నిర్మాణంతో పేదలకు అండగా నిలిచారని ప్రశంసించారు. రూ.2 లకే కిలో బియ్యం అందించి పేదల ఆకలిని తీర్చారని ఆకాశానికెత్తారు. ఎన్టీఆర్.. ప్రతి తెలుగు వాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
కడప మహానాడులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. pic.twitter.com/qgwk8xg8ck
— ChotaNews App (@ChotaNewsApp) May 28, 2025
మరోవైపు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఉదయం అక్కడకు వెళ్లి టాలీవుడ్ స్టార్ హీరోలు తారక్ (Tarak), ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ (Kalyan Ram).. తమ తాతకు అంజలి ఘటించారు. సమాధిపై పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మరోవైపు ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి సైతం ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్
నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా కుటుంబసభ్యులు, అభిమానులు, తెలుగు దేశం నేతలు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు నటులు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్… pic.twitter.com/Dyu7MXwPQ7
— ChotaNews App (@ChotaNewsApp) May 28, 2025