Kalvakuntla Kavitha( iamge credit: twittweer)
Politics

Kalvakuntla Kavitha: కవితతో ఎంపీ దామోదర్ కీలక భేటీ.. కొత్త పార్టీని ఆపేందుకేనా?

Kalvakuntla Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తో రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు భేటీ అయ్యారు. హైదరాబాదులోని ఆమె నివాసానికి సోమవారం న్యాయవాది గండ్ర మోహన్ రావు తో కలిసి వెళ్లారు. పార్టీ అధినేత కేసిఆర్ అదేశాల మేరకే కవితతో భేటీ అయినట్లు సమాచారం. ఈ భేటీలో సుమారు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఎల్కతుర్తి సభ ను గత నెల 27న నిర్వహించిన విషయం తెలిసిందే. సభపై నెగిటివ్, పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ను కేసిఆర్ కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు. ఈ అంశాలపై సైతం చర్చించినట్లు తెలిసింది.

పార్టీకి సంబంధించిన పలు ఇతర అంశాలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. తాను లేఖలో ప్రస్తావించిన అంశాలు పార్టీ లీడర్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ మాత్రమేనని, దానిని అధినేత దృష్టికి తీసుకెళ్లేందుకు మాత్రమే ఒక నోటు రూపొందించినట్లు గా కవిత చెప్పినట్లు సమాచారం. అయితే లేఖ బయటకు రావడం తనను తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని ఆమె ఆవేద‌ వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. .పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని తాను లేఖ రాసినట్లు కవిత వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

Also Read: Telangana Formation Day: యువతకు గుడ్ న్యూస్.. రూ.8,000 కోట్లతో ఉపాధి.. డిప్యూటీ సీఎం వెల్లడి!

ఆ లేఖలో వివాదాస్పద అంశాలు ఏమీ లేకుండా దానిని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్, బిజెపిలో అస్త్రంగా వాడుకునే ప్రయత్నాలు చేసిన అంశాలను సైతం ఈ భేటీలో చర్చించారు. తనకు పార్టీలో ఎవరితోనూ విభేదాలు లేవని.. కానీ కొన్ని దిద్దుబాట్లు చేస్తే మరింత బలంగా ప్రజల్లోకి పార్టీ వెళ్ళవచ్చని అభిప్రాయాన్ని కవిత వ్యక్తం చేసినట్లు తెలిసింది. త్వరలో పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసి అన్ని విషయాలు వివరిస్తానని కవిత చెప్పినట్లు తెలిసింది. కవితను దామోదర్ రావు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమెను శాంతింప చేయడం కోసం ఈ భేటీ జరిగినట్లు సమాచారం. ప్రజల్లో నెగెటివ్ పోకుండా ఉండేందుకే ఈ రాయబారం అని సమాచారం. కవిత ఎప్పుడు కేసీఆర్ తో భేటీ అవుతుంది అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

Also Read: Telangana Formation Day: కేటీఆర్ కీలక ప్రకటన.. సిద్ధంగా ఉండాలని క్యాడర్‌కు పిలుపు.. ఎందుకంటే?

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది