Telangana Formation Day(image credit: twitter)
తెలంగాణ

Telangana Formation Day: యువతకు గుడ్ న్యూస్.. రూ.8,000 కోట్లతో ఉపాధి.. డిప్యూటీ సీఎం వెల్లడి!

Telangana Formation Day: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సంబంధిత అధికారులను ఆదేశించారు.  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రాజీవ్ యువ వికాసం పథకం అమలు ప్రగతిని డిప్యూటీ సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. నిరుద్యోగ యువత ఆశలను ముందుకు తీసుకు వెళ్లే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ ప్రతిష్టాత్మకంగా భావించి రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చిందని అధికారులకు సూచించారు.

జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజీవ్ యువ వికాసం పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ ల పంపిణీ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించాలని ఆదేశించారు. జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా మరియు నియోజకవర్గ స్థాయి లో ఓకే సారీ రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జూన్15 తర్వాత గ్రౌండింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండు నాటికి లక్ష్యంగా పెట్టుకున్న ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ఆదేశించారు.

Aslo Read: Fake IAS officer: వామ్మో ఎంత మోసం.. నకిలీ ఐఏఎస్ గుట్టురట్టు!

ప్రతి నెలా ఈ కార్యక్రమం చేపట్టి దశలవారీగా పూర్తి చేయాలని, జిల్లా ఇన్చార్జి మంత్రులు, కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లోని యువత గిగ్ వర్కర్లుగా ఉపాధి పొందేందుకు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు రాజీవ్ యువ వికాసంలో వారికి అవకాశం కల్పించేలా చూడాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. సంక్షేమ శాఖల కార్పొరేషన్ చైర్మన్లకు రాజీవ్ వికాసం కింద అవకాశం కల్పించాలంటూ యువత దరఖాస్తులు చేసుకున్నారు, ఆ దరఖాస్తులన్నిటిని పరిశీలించి సంబంధిత జిల్లా కలెక్టర్లకు వెంటనే పంపేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

గత పది సంవత్సరాల కాలంలో సంక్షేమ శాఖలను, రాష్ట్ర యువతను గాలికి వదిలేసారని డిప్యూటీ సీఎం అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో సంక్షేమ శాఖల ద్వారా ఆయా వర్గాలకు అందిన మొత్తాన్ని ప్రజా ప్రభుత్వం కేవలం ఒక్క సంవత్సరంలో రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఆయా వర్గాల యువతకు చేయూతనిస్తుంది అన్నారు. దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు, ఏ రాష్ట్రంలోను ఒక సంవత్సరంలో స్వయం ఉపాధి కోసం ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసిన దాఖలాలు లేవని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఇంతటి గొప్ప కార్యక్రమం ఇందిరమ్మ రాజ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది అన్నారు.

Also Read: Minister Seethaka: ట్రాన్స్ జెండర్లకు అవకాశాలపై.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు!

ఈ పథకాన్ని విజయవంతం చేయడం కోసం వారం క్రితమే ఎస్ ఎల్ బి సి సమావేశం నిర్వహించాం, ఆ తర్వాత సంక్షేమ శాఖ అధికారులు బ్యాంకర్లతో తరచూ మాట్లాడుతూ ఈ స్వయం ఉపాధి పథకాన్ని చివరి దశకు చేర్చారనీ అభినందించారు. వెంటనే కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జూన్ 2న సాక్ష్యం లెటర్ల పంపిణీ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. హై లెవెల్ కమిటీ సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ యాస్మిన్ భాషా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: GHMC officials: మళ్లీ మునక తప్పదా?.. పూడికతీత పనులపై అనుమానాలు ఎన్నో?

ఆవిర్భావ సంబరాలు అంబరాన్ని అంటాలి రాష్ట్ర కీర్తి ప్రతిబింబించేలా విజయోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సంబరాలు అంబరాన్ని అంటే లా అధికారులు ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కోఆర్డినేషన్ సమావేశంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంగా జిల్లాలో జూన్ 2న జరుగుతున్న ఏర్పాట్లను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సమీక్షించారు. జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడం ఆ తరువాత పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న జెండా వందనం, మార్చ్ ఫాస్ట్, ప్రసంగం, అధికారులకు మెడల్స్ పంపిణీ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ప్రధానంగా హైదరాబాద్ ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో ఇంచార్జి మంత్రులు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోను రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వాణపై సమీక్షించారు. ఈసారి అవతరణ ఉత్సవాలకు రాష్ట్ర అతిథులుగా జపాన్ మేయర్, మిస్ వరల్డ్ విజేతలు హాజరై వేడుకలను తిలకించనున్నారని ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ cs లు వికాస్ రాజ్ ,రఘునందన్ రావు, సమాచార శాఖ కమిషనర్ హరీష్, పోలీస్ అధికారులు సీవీ ఆనంద్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలను డిప్యూటీ సీఎం కు వివరించిన అధికారులు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. సీసీఎల్ ఏ కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయత్ రాజ్ సెక్రెటరీ లోకేష్ కుమార్, ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ లతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై వారి సమస్యలపై విజ్ఞాపనలు స్వీకరించారు. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని మంగళవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం, ఉద్యోగుల సమస్యల పరిష్కార సబ్ కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క కు వివరించారు. ఈనెల 29న సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలు, వాటి పరిష్కారానికి సంబంధించిన సమాచారాన్ని సబ్ కమిటీ సమావేశంలో వివరించాలని అధికారుల కమిటీకి డిప్యూటీ సీఎం సూచించారు.

Also Read: Kalvakuntla Kavitha: కవితతో ఎంపీ దామోదర్ కీలక భేటీ.. కొత్త పార్టీని ఆపేందుకేనా?

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్