Kannappa In Trouble: తెలుగు స్టార్ హీరో మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. గత కొద్దీ రోజుల నుంచి మూవీకి సంబందించిన ప్రమోషన్స్ చిత్ర బృందం బిజీగా ఉంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ తదితర నటులు నటిస్తున్నారు.
Also Read: Vallabhaneni Vamsi Health: వంశీకి మళ్లీ సీరియస్.. పోలీస్ స్టేషన్‌లో వాంతులు.. ఆందోళనలో ఫ్యామిలీ!
కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ మాయం?
అయితే, ఓ వైపు ఫ్యామిలీ గొడవలు, ఇంకో వైపు సినిమా రిలీజ్ విషయంలో వరుస వివాదాలతో సతమవుతున్న మంచు విష్ణుకు పెద్ద షాక్ తగిలింది. త్వరలో మన ముందుకు రానున్న కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్‌డ్రైవ్ కనిపించడం లేదు.
Also Read: Actress Snigdha: నా జెండర్ అదే అంటూ నటి స్నిగ్ధ సంచలన కామెంట్స్.. అమ్మాయా? అబ్బాయా?
పోలీసులకు 24 ఫ్రెమ్స్ సంస్థ ఫిర్యాదు
ఫిలింనగర్ పోలీసులకు 24 ఫ్రెమ్స్ సంస్థ ఫిర్యాదు చేశారు. మహిళా ఉద్యోగి హార్డ్ డిస్క్ ను దొంగిలించినట్టు ఫిర్యాదు చేశారు. ఆఫీస్ బాయ్ పార్సిల్ తీసుకొని చరితకు ఇచ్చినట్లు చెబుతున్నాడు. హార్డ్ డిస్క్ తీసుకున్నప్పటి నుంచి యువతి కనిపించడం లేదు. ఆ హార్డ్ డిస్క్ ఈ నెల 24 న కొరియర్ ద్వారా ముంబై నుండి హైదరాబాద్ వచ్చింది. దానిలో 1 గంట 30 నిముషాల సినిమా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. చరిత అనే ఉద్యోగి అందుబాటులో లేదంటూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఫిల్మ్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.