Dil Raju
ఎంటర్‌టైన్మెంట్

Dil Raju: సమస్య మొదలైంది అక్కడే! పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ఎవరికీ లేదు

Dil Raju: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా థియేటర్ల బంద్ విషయమై జరుగుతున్న రచ్చపై వివరణ ఇచ్చేందుకు నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆదివారం నిర్మాత అల్లు అరవింద్ మీడియా సమావేశం నిర్వహించి, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో వివరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దిల్ రాజు కూడా, తన దగ్గర ఉన్న సమాచారాన్ని మీడియా ముందు ఉంచి, ఈ సమస్యకు సొల్యూషన్ మీడియా వాళ్లు కూడా ఆలోచిస్తే బాగుంటుందని అన్నారు. ఇంకా మీడియా వాళ్లు అడిగిన డౌట్స్‌కు ఆయన సమాధానమిచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదని మరోసారి ఆయన క్లారిటీ ఇచ్చారు.

Also Read- Kandula Durgesh: సినీ పరిశ్రమను అస్థిరపరిచే చర్యలు ఎవరి నుంచి వచ్చినా సహించం!

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ:
– తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 370 సింగిల్ స్ర్కీన్ థియేటర్స్ ఉంటే.. అందులో 30 మాత్రమే మాకు సంబంధించినవి. ఏషియన్ సునీల్, డి. సురేశ్ బాబు కంపెనీలకు 90 థియేటర్లు ఉన్నాయి. మిగతా 250 థియేటర్లను ఓనర్లు, వారికి సంబంధించిన వారే నడుపుకుంటున్నారు.
– ‘ఆ నలుగురు’ అంటూ ఇష్టం వచ్చినట్లుగా రాతలు రాస్తున్నారు. ముందు ఈ థియేటర్ల క్లారిటీని అంతా గుర్తు పెట్టుకోండి. మాపై దాడి చేయడం ఆపండి.
– అసలీ సమస్య ఏప్రిల్‌లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మీటింగ్‌లో ఉద్భవించింది. పర్సెంటేజ్‌ల విషయంలో ఎగ్జిబిటర్లకు కొన్ని సమస్యలు ఉన్నాయి. వారు కూడా పర్సెంటేజ్ విధానం ఉండాలని కోరారు. దాని కోసం వారు డిస్ట్రిబ్యూటర్లతో కలిసి సమావేశం నిర్వహించారు.
– తూర్పుగోదావరి నుంచి నైజాంకు ఈ సమస్య వచ్చింది. అసలు ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందో తెలుసుకోవడానికి ఆరు నెలలుగా వస్తున్న రెవెన్యూ షీట్స్ ఇవ్వాలని అడిగాం. ప్రస్తుతం టాలీవుడ్‌లో రెంట్ ఆర్ పర్సేంటేజ్ విధానమే నడుస్తుంది. పర్సెంటేజ్ సమస్య తెలంగాణకు రాగా, ఇక్కడి ఎగ్జిబిటర్లు శిరీష్‌కు ఆ విషయం చెప్పారు.
– ఎగ్జిబిటర్లకు ఏం కావాలో అది వారు అడగడంలో తప్పులేదు. మే 18న వారి సమస్యపై చాంబర్‌లో మీటింగ్ నిర్వహించాం. జూన్ 1 నుంచి బంద్ అని ఎగ్జిబిటర్లు అంటే వద్దు.. అంతకు ముందు 56 రోజుల పాటు షూటింగ్ ఆపేసినప్పుడు ఏం జరిగిందో చెప్పి.. వాళ్లని వారించే ప్రయత్నం చేశాం.

– ఎగ్జిబిటర్లు కోరుకుంటున్న పర్సంటేజీపై ఛాంబర్‌కు వాళ్లు లేఖ రూపంలో తెలియజేశారు. బంద్ చేస్తామనేది కేవలం వారి ఆలోచన మాత్రమే. బంద్ విషయాన్ని వెంటనే ఛాంబర్ ఖండించకపోవడం తప్పే. ఈలోపు మీడియాలో బంద్ అంటూ వార్తలు వచ్చేశాయి. ‘హరిహర వీరమల్లు’ విషయంలో ఇది తప్పుగా వెళ్లింది.
– ఏప్రిల్‌లో ఈ సమస్య మొదలవ్వగా ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీని మే నెలలో అంటూ ప్రకటించారు. కానీ కొన్ని కారణాలతో మళ్లీ వాయిదా వేశారు.
– పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపే దమ్ముకానీ, ధైర్యం కానీ ఎవరికీ లేదు. మంత్రి దుర్గేష్ నాకు ఫోన్ చేసినప్పుడు కూడా బంద్ ఏం జరగదు అని చెప్పాను. పరిస్థితిని ఆయనకు వివరించాను.
– రాబోయే మూడు నెలలు సినిమాలకు కీలక సీజన్. తూర్పుగోదావరిలో ఒక వ్యక్తితో మొదలైన ఈ సమస్యను తెలంగాణకు కూడా ఆపాదించారు.
– టాలీవుడ్‌కు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సహకారం ఎంతో ముఖ్యం. టాలీవుడ్‌కు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటాననే సీఎం రేవంత్ రెడ్డి ఎఫ్‌డిసి ఛైర్మన్‌ బాధ్యతలను నాకు అప్పగించారు.

Also Read- Tollywood: పవన్ కళ్యాణ్‌ సినిమాలకు బ్రేక్ వేసిందెవరు?.. వైసీపీ కీలక నేత రివెంజేనా?

– ఏపీలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంతా భయంభయంగా ఉండేది. కూటమి ప్రభుత్వం ఫామ్ చేశాక.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి ఏది కావాలంటే అది ఇస్తున్నారు. నిర్మాతలంతా పక్కింటికి వెళ్లినంత సులభంగా ఒక పేపర్ పట్టుకుని వెళ్లి టికెట్ ధరలు పెంచుకుని వస్తున్నారు.
– అలా ఒక్కొక్కరుగా కాకుండా అందరూ యూనిటీగా వెళ్లాలనే ఆలోచన ఎవరూ చేయడం లేదు. సినిమాలు విడుదల అవుతున్నప్పుడు మాత్రమే ప్రభుత్వాలు గుర్తొస్తున్నాయి.
– రెండు ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు అండగానే ఉంటూ వస్తున్నాయి. ఛాంబర్‌ పెద్దలలోనే ఐక్యత లేదు. నిన్న అల్లు అరవింద్ మీడియా మీట్ పెట్టారు. ఈ రోజు నేను పెట్టాను. మేం కలిసి కదా మీడియా సమావేశం పెట్టాలి. అదే చెబుతుంది.. మాలో ఐక్యత లేదు. ఇప్పటికైనా అందరూ కలిసి వచ్చి, ఈ సమస్యను దూరం చేసుకుందాం.
– మీడియా వాళ్లు కూడా దీనిని కాంట్రవర్సీ చేసి లాభపడాలని కాకుండా.. తెలివిగా ఆలోచించి ఈ సమస్యకు ఏదైనా సొల్యూషన్ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?