Terrorist Organizations (imagecredit:twitter)
తెలంగాణ

Terrorist Organizations: ఉగ్ర కుట్రల వెనక ఆ రెండు సంస్థలు.. సంచలన విషయాలు వెలుగులోకి!

Terrorist Organizations: పేలుళ్లతోపాటు ఆత్మాహుతి దాడులకు కుట్ర చేసిన సిరాజ్, సమీర్​తదితరుల వెనక నిషేధిత ఉగ్రవాద సంస్థలు పాపులర్ ఫ్రంట్​ఆఫ్ ఇండియా హిజ్బుత్​తెహ్రీర్​ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండు సంస్థలకు చెందిన హ్యాండ్లర్లే సిరాజ్, సమీర్ లతో అల్​హింద్​ఇత్తెహాదుల్​ముస్లిమీన్​గ్రూప్​ను మొదలు పెట్టించినట్టుగా సమాచారం. ఇస్లామిక్​ రాజ్య(షరియా) స్థాపనే లక్ష్యమని ఈ ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే ప్రకటించటం విచారణలో సిరాజ్, సమీర్లు ఇదే విషయాన్ని చెప్పటం గమనార్హం. నిఘా వర్గాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి.

50 దేశాల్లో

కౌంటర్ ఇంటెలిజెన్స్​విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపిన ప్రకారం హిజ్బుత్ తెహ్రీర్​సంస్థ 30కి పైగా దేశాల్లో విస్తరించి ఉంది. వీటిలో సౌదీ, ఒమన్​కూడా ఉన్నాయి. అధికారులు చెబుతున్న ప్రకారం ఇస్లామిక్​స్టేట్​ఆఫ్​ఇరాక్​అండ్​ సిరియా (ఐఎస్​ఐఎస్) కన్నా ఇది ప్రమాదకరమైంది. ఈ సంస్థకు చెందిన హ్యాండ్లర్లు సోషల్​మీడియా ద్వారా మత దురభిమానం ఉన్న యువకులను గుర్తించి వారి టచ్​లోకి వెళుతుంటారు. వేర్వేరు ప్లాట్​ఫాంల ద్వారా ఛాటింగ్ మొదలు పెడతారు. రెచ్చగొట్టే ప్రసంగాలు వీడియోల క్లిప్పింగులను పంపించి యువకులను జిహాద్ బాటలోకి నడిపిస్తారు.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ సంస్థలో ప్రత్యేకంగా ఆర్మ్ డ్ వింగ్ ఉండటం. ఈ వింగ్ లో ఉన్న వారు జిహాద్ వైపు ఆకర్షితులైన యువకులకు బాంబులు ఎలా తయారు చేయాలి? ఆయుధాలను ఎలా ఉపయోగించాలి? అన్న దారిపై తర్ఫీదు ఇస్తుంటారని ఆ అధికారి చెప్పారు. దాంతోపాటు బ్యాక్టిరియాలాజికల్, బయోలాజికల్ వార్ లోనూ ట్రైనింగ్ ఇస్తుంటారన్నారు. ఈ సంస్థ నెట్​వర్క్ మన దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో విస్తరించి ఉందన్నారు. దాదాపు రెండేళ్ల క్రితం భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కొందరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నపుడు ఈ సంస్థ కార్యకలాపాలు వెలుగు చూశాయన్నారు. ఇస్లామిక్​రాజ్య స్థాపనే తమ లక్ష్యమని ఈ సంస్థ పలుమార్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

Also Read: KTR on CM Revanth: బీఆర్ఎస్ లో రేవంత్ కోవర్టులు.. కేటీఆర్ సంచలన కామెంట్స్!

అలజడులు సృష్టించటమే టార్గెట్

ఇక, కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ఉగ్ర సంస్థల జాబితాలో ఉన్న పాపులర్​ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లక్ష్యం కూడా ఇస్లామిక్ రాజ్య స్థాపనే కావటం గమనార్హం. కేరళలో పుట్టిన ఈ సంస్థకు దేశవ్యాప్తంగా నెట్​వర్క్ ఉంది. తెలంగాణతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సంస్థకు చెందినవారు పదుల సంఖ్యలో ఉన్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. రెచ్చగొట్టటం ద్వారా యువకులను ఉగ్రవాదం బాటలోకి నడిపించి అలజడులు సృష్టించటమే టార్గెట్ గా ఈ సంస్థ పని చేస్తోందని తెలిపాయి. గమనించాల్సిన అంశం ఏమిటంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్​ఇండియాకు చెందిన ఉగ్రవాదులు భారీ పేలుళ్లు సృష్టించటంతోపాటు లక్ష్యంగా చేసుకున్న రాజకీయ నాయకులు, ఆర్​ఎస్ఎస్ నేతలను హత్యలు చేయటానికి పన్నాగాలు పన్నటం. దీని కోసం యువకులకు కత్తులు, డాకర్లను ఉపయోగించి ఎలా దాడులు జరపాలి? శరీరంలోని ఏ భాగంలో పొడిస్తే వెంటనే మనిషి చనిపోతాడన్న దానిపై కొందరు యువకులకు శిక్షణ ఇచ్చినట్టు భోపాల్ మాడ్యూల్​ లోని కొందరు ఉగ్రవాదులను అరెస్టు చేసినపుడు వెలుగు చూడటం గమనార్హం.

ఇస్లామిక్​రాజ్య స్థాపనే లక్ష్యం

తాజాగా పేలుళ్ల కుట్రలో పట్టుబడ్డ సిరాజ్, సమీర్​ల వెనక ఈ రెండు సంస్థలే ఉన్నట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటివరకు జరిపిన విచారణలో ఇస్లామిక్​రాజ్య స్థాపనే తమ లక్ష్యమని సిరాజ్, సమీర్​లు చెప్పటం గమనార్హం. దాంతోపాటు కొంతమంది ఆర్ఎస్​ఎస్ నాయకులను టార్గెట్ చేసినట్టుగా చెప్పటం, హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా పేలుళ్లు జరపాలని పన్నాగాలు పన్నినట్టు వెల్లడించటం వీటికి బలాన్ని చేకూరుస్తున్నాయి. నిజానికి హిజ్బుత్​ తెహ్రీర్, పాపులర్​ఫ్రంట్​ఆఫ్ ఇండియా కలిసి పని చేస్తున్నట్టుగా కూడా తమకు అనుమానాలు ఉన్నట్టు నిఘా విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. సిరాజ్, సమీర్ ల విచారణలో దీనికి సంబంధించి కీలక వివరాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయన్నారు.

Also Read: Panchayat Raj Jobs: పంచాయతీ రాజ్ లో ప్రమోషన్లకు మోక్షం కలిగేనా?

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు