Hyderabad Metro Rail: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ వేడుకలలో హైదరాబాద్ మెట్రో రైల్ కూడా నేను సైతం అంటూ భాగస్వామ్యం అయ్యింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మెట్రో రైల్ కూడా ఈ కార్యక్రమాన్ని అందరికీ చేరవేయాలన్న సంకల్పంతో విస్తృత ప్రచారం చేపట్టింది. తెలంగాణలోని వివిధ పర్యాటక ప్రాంతాల ప్రాశస్త్యాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు ప్రపంచ సుందరీమణులను తెలంగాణాకి పరిచయం చేసేలా అటు హైటెక్ సిటీ నుండి నాగోల్ వరకు ఇటు మియాపూర్ నుండి ఎల్ బీ నగర్ వరకు పలు ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు, మెట్రో స్తంభాలు, రహదారులకు ఇరువైపులా ఉన్న మెట్రో రైలింగ్లు పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకర్షణగా నిలిచాయి. మెట్రో రైళ్లలో స్క్రీన్ ల పైన, మెట్రో స్టేషన్ ప్లాట్ ఫామ్లు కాన్ కోర్స్ లలో ప్రకటనల బోర్డుల పైనా మిస్ వరల్డ్ వేడుకలను ప్రతిబింబించేల విస్తృతంగా ప్రచారం చేపట్టింది హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ.
Also Read: Ponnam Prabhakar: విధుల్లో నిజాయితీగా పనిచేయాలి.. రవాణాశాఖకు మంచి పేరు తేవాలి!
ఇక రహదారుల నుండి స్టేషన్లలోకి వెళ్ళే ప్రవేశ ద్వారం వద్ద సంప్రదాయ చిత్రాలతో కూడిన ఆర్చ్ లను ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు మరింత వన్నె తెచ్చింది.
రోజూ దాదాపు నాలుగున్నర నుండి అయిదు లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యాలకు చేరుస్తున్న మెట్రో రైల్ ఈ ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ కార్యక్రమం ద్వారా తెలంగాణ వారసత్వ సంపదను నలుగురికీ తెలియజేసే బృహత్ కార్యక్రమంలో పాల్గొంటోందని మెట్రో ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆధ్యాత్మిక సంరంభం, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలిచిన అమ్రాబాద్ పులుల అభయారణ్యం, ఐక్యరాజ్య సమితి గుర్తించిన వారసత్వ ప్రాంగణం రామప్ప దేవాలయం, తెలంగాణ సంప్రదాయాలకు కీర్తి పతాకగా నిలిచిన బోనాలు, బతుకమ్మ, చార్మినార్ వంటి విశేషాలతో కూడిన ఆకర్షణీయ దృశ్యాలను ‘మెట్రో రైల్’ ఈ వేడుకల సందర్భంగా మరింత విస్తృత ప్రచారం కల్పించిందని మెట్రో ఎండీ వెల్లడించారు.
Also Rread: Mallu Ravi – Ponnam: నోరు జాగ్రత్త.. చెప్పులకు పని చెప్తాం.. కేటీఆర్‌కు ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్!