Bunny Vas: శనివారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కార్యాలయం (AP Deputy CMO) నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలకు చిన్నపాటి వార్నింగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత, ఈసారి పక్కాగా విడుదలవుతుందనే నమ్మకం వచ్చిన తర్వాత.. ఫ్యాన్స్ అందరూ సినిమా కోసం వెయిట్ చేస్తుంటే.. ఇండస్ట్రీలో మాత్రం ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్ల పర్సెంటేజ్‌లంటూ మీటింగ్‌లు పెట్టి, జూన్ 1 నుంచి థియేటర్ల బంద్‌కు దిగుతామని సంకేతాలు పంపుతున్నారు. అంతే, పవన్ కళ్యాణ్‌కు ఆగ్రహం వచ్చేసింది. సినిమాలు పక్కనపెట్టి పాలిటిక్స్‌లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల వరకు పూర్తి చేసే పనిలో ఉన్నారు. అందులో షూటింగ్ పూర్తై అన్ని కార్యక్రమాలు జరుపుకుంటున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. అటు పొలిటికల్‌గా బిజీగా ఉంటూనే, ఖాళీ టైమ్‌లో ఎలాగోలా టైమ్ సర్దుబాటు చేసుకుని షూటింగ్ పూర్తి చేశాడాయన. అంత కష్టపడి ఆయన సినిమాను పూర్తి చేస్తే, తీరా విడుదల అనే సమయానికి ఇలాంటి లొల్లి పెట్టుకోవడంతో.. ఆయన సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.
Also Read- Spirit: వాళ్లు, వీళ్లు కాదు.. ‘స్పిరిట్’ హీరోయిన్ ఎవరో అఫీషియల్‌గా ప్రకటించేశారోచ్!
సినిమా వాళ్ల పక్షాన నిలబడినందుకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ ఓ సుదీర్ఘ లేఖను ఆయన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ అంశంపై నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘‘సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్‌గా ఉంటాయి.. అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే.. ప్రొడ్యూసర్స్ గానీ.. డిస్ట్రిబ్యూటర్స్ కానీ.. ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్ళనే మనం ఇరిటేట్ చేశామంటే.. మన యూనిటీ ఎలా ఉంది? అని ప్రశ్నించుకునే సమయం వచ్చింది.’’ అని బన్నీ వాసు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనికి నెటిజన్లు కూడా ఇప్పటికైనా అందరూ యూనిటీగా ఉండి, సమస్యలను పరిష్కరించుకోండి. అలాంటి వ్యక్తి మిమ్మల్ని పిలుస్తుంటే పోకుండా.. ఎందుకీ నాటకాలాడుతున్నారు.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం.
Also Read- Mukul Dev: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ విలన్ కన్నుమూత.. ఎన్టీఆర్ సంతాపం
మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి
బన్నీ వాసు ఇలా పోస్ట్ చేస్తే.. అంతకు ముందు జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో నిర్మాత ఎస్‌కెఎన్ కూడా టాలీవుడ్‌పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా కలిసి సినిమాను కాపాడుకోవాలని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. వీళ్ల పర్సంటేజ్‌లు ఏమోగానీ, ప్రేక్షకులు థియేటర్స్ వచ్చే పర్సంటేజీ బాగా తగ్గిపోయింది. ముందు దానిపై దృష్టి పెట్టండి. ఇందుకు టికెట్ రేట్స్, పాప్ కార్న్ ధరలు, వారమంతా ఒకే టికెట్ ధరలు ఉండటం..ఇలా అనేక కారణాలు ఉన్నాయి. వీక్ డేస్‌లో ఒక ధర, వీకెండ్‌లో మరోలా టికెట్ ధరలు పెట్టుకుంటే ఆడియెన్స్ ను థియేటర్స్ కు ఆకర్షించవచ్చు. ప్రేక్షకుల మీద భారం వేయకుండా వారికి వీలైనంత తక్కువలో ఎలా వినోదం అందిస్తామనేది ఆలోచించాలి. చిత్ర పరిశ్రమలోని గౌరవ పెద్దలంతా ఈ సమస్యల మీద ముందు దృష్టి సారించాలని కోరుతున్నాను. ఆడియెన్స్ థియేటర్స్‌కు వస్తే ఎగ్జిబిటర్స్ అందరూ బాగుంటారు. వారి సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అందరికీ ఆదాయం లభిస్తుంది. అత్యవసరంగా ఆస్పత్రికి వచ్చిన పేషెంట్‌కు ఫేషియల్ చేస్తామని ఎవరూ అనరూ.. బతికించాలని ప్రయత్నిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న మన తెలుగు సినిమాను బతికించుకునే ప్రయత్నం చేయాలి. మన సినిమాను బతికించుకునేందుకు మనమంతా ఒక్కటిగా ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.
సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా ఉంటాయి.. అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే.. ప్రొడ్యూసర్స్ గానీ.. డిస్ట్రిబ్యూటర్స్ కానీ.. ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం…
— Bunny Vas (@TheBunnyVas) May 24, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు