Mukul Dev: సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. బాలీవుడ్ నటుడు, టాలీవుడ్ స్టార్ విలన్ ముకుల్ దేవ్ (54) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముకుల్ దేవ్ (Mukul Dev), ముంబైలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. ముకుల్ దేవ్ మరణ వార్త తెలిసిన వారంతా దిగ్భ్రాంతికి గురవుతూ, సంతాపం తెలియజేస్తున్నారు. ముకుల్ దేవ్ బాలీవుడ్ నటుడు అయినప్పటికీ, టాలీవుడ్‌లో ఆయన స్టార్ హీరోల చిత్రాలలో విలన్‌గా నటించారు. ఆయన అకాల మరణం ఇండస్ట్రీని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. బాలీవుడ్ ప్రముఖులే కాదు, టాలీవుడ్ నుంచి కూడా ప్రేక్షకులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.
Also Read- AP Deputy CMO: తెలుగు చిత్రసీమ సంఘాలపై ఏపీ డిప్యూటీ సీఎం అక్షింతలు
గొప్ప కళాకారుడిని కోల్పోయాం
ముకుల్ దేవ్ ఎవరో కాదు.. ప్రస్తుతం సౌత్‌లో స్టార్ విలన్‌గా దూసుకుపోతున్న రాహుల్ దేవ్ (Rahul Dev) సోదరుడు. ముకుల్ ఇక లేడనే విషయాన్ని నమ్మలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశారు బాలీవుడ్ సీనియర్ నటుడు మనోజ్ పాజ్‌పాయ్ (Manoj Bajpayee). సోషల్ మీడియా వేదికగా ఆయన రియాక్ట్ అవుతూ.. ముకుల్ అకాల మరణం బాధాకరం, ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయాం. కాలం ఆయనని త్వరగా తీసుకెళ్లిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నానని వెల్లడించారు.
Theatres Strike Postponed: ఈ నెల 30 న కమిటీ సమావేశం.. పవన్ సినిమాకు ఇంకా ఎన్ని గండాలున్నాయి?
విచారం వ్యక్తం చేసిన టాలీవుడ్ హీరో
ముకుల్ దేవ్ మరణ వార్త తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ఎక్స్ వేదికగా ముకుల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘ముకుల్ దేవ్ మరణించడం బాధాకరం. ‘అదుర్స్’లో ఆయనతో కలిసి వర్క్ చేసినప్పుడు ఆయన నిబద్ధత ఏంటో తెలిసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇక ముకుల్ దేవ్ విషయానికి వస్తే.. ఆయనకు రవితేజ, వినాయక్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘కృష్ణ’ చిత్రం (Krishna Movie) మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. హీరోకి పోటీగా ఆయన ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత ముకుల్ పేరు టాలీవుడ్‌లో బాగా హైలైట్ అవడంతో పాటు, వరుస అవకాశాలు ఆయనను పలకరించాయి. ‘మాస్, సింహాద్రి, సిద్ధం, నిప్పు, భాయ్, సీతయ్య’ వంటి చిత్రాల్లో నటించిన ముకుల్ దేవ్.. మొదట సీరియల్ నటుడిగా కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత పలు భాషల్లోని సినిమాలలో ఆయన నటించారు.
Saddened by the passing of Mukul Dev garu. Remembering our time in Adhurs and his commitment to the craft. My condolences to his family. Om Shanti. 🙏 pic.twitter.com/Rp4HsrLR2I
— Jr NTR (@tarak9999) May 24, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు