Prabhas and Sandeep Reddy Vanga
ఎంటర్‌టైన్మెంట్

Spirit: వాళ్లు, వీళ్లు కాదు.. ‘స్పిరిట్’ హీరోయిన్ ఎవరో అఫీషియల్‌గా ప్రకటించేశారోచ్!

Spirit: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి (Sandeep Reddy Vanga) వంగా కాంబినేషన్‌లో అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’ చిత్రం రూపుదిద్దుకోబోతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. కానీ, ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా జరుగుతుండటంతో పాటు, ప్రభాస్ ఇతర కమిట్‌మెంట్స్ పూర్తి చేయాల్సిన కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను సందీప్ రెడ్డి వంగా పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. ఏ నిమిషంలోనైనా ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లిపోవచ్చు. ఈ లోపు నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనల్ చేసే పనిలో వంగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూవీలో నటించే హీరోయిన్‌పై కొన్ని రోజులుగా పెద్ద యుద్ధమే నడుస్తుంది.

Also Read- Mukul Dev: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ విలన్ కన్నుమూత.. ఎన్టీఆర్ సంతాపం

మరీ ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేని సందీప్ రిజిక్ట్ చేశాడనే వార్త బాగా హైలైట్ అవుతోంది. ఆమెని కాదని, హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌ని ఫైనల్ చేసినట్లుగా వార్తలు రావడంతో, బాలీవుడ్ మీడియా అంతా వంగాపై పగబట్టినట్లుగా టాక్ నడుస్తూ వస్తుంది. దీపికాను రిజిక్ట్ చేయడమంటే మాములు విషయం కాదని, ఇక వంగా బాలీవుడ్‌లో మనుగడ సాధించడం కష్టమే అన్నట్లుగా కొందరు వార్తలను క్రియేట్ చేస్తున్నారు. ఈ వార్తలను పక్కన పెడితే.. ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్‌ని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు సందీప్ రెడ్డి వంగా ట్విట్టర్ ఎక్స్ వేదికగా హీరోయిన్ ఎవరో చెబుతూ.. ఆమె పేరును తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌ భాషల్లో ప్రకటించడం విశేషం. అంటే, ఈ సినిమా 9 భాషల్లో తెరకెక్కుతోందన్నమాట. కొరియన్ కూడా అంటే, మొదటి నుంచి వినిపిస్తున్నట్లుగా ఇందులో దక్షిణ కొరియా నటుడు మా డాంగ్ సియోక్ విలన్‌గా నటిస్తున్నట్లుగా వచ్చిన వార్తలు కూడా నిజమే అని అనుకోవచ్చు.

Also Read- AP Deputy CMO: తెలుగు చిత్రసీమ సంఘాలపై ఏపీ డిప్యూటీ సీఎం అక్షింతలు

ఇక వంగా ప్రకటించిన హీరోయిన్ ఎవరో కాదు.. ‘యానిమల్’ సినిమాతో అందరి గుండెలను పిండేసిన త్రిప్తి డిమ్రీ (Tripti Dimri). అసలెవరు ఊహించని పేరుని ఆయన ప్రకటించి.. తన స్పెషల్ ఏంటో మరోసారి వంగా చాటుకున్నాడు. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ అంటే.. నిజంగా ఆమె నక్కతోక తొక్కినట్టే. ఈ సినిమాలో సెలక్ట్ అవడంపై ఆమె కూడా తన ఆనందాన్ని తెలియజేసింది. ‘‘ఇప్పటికీ నేను ఆనందంలోనే మునిగిపోయి ఉన్నాను. ఈ జర్నీలో నన్ను నమ్మినందుకు ఎంతగానో రుణపడి ఉంటాను. మీ విజనరీ మేకింగ్‌లో మరోసారి భాగమైనందుకు థ్యాంక్యూ సందీప్ రెడ్డి వంగా’’ అని పేర్కొంది. త్రిప్తి డిమ్రీకి సందీప్ తెరకెక్కించిన ‘యానిమల్’ చిత్రంతో ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె అత్యంత చేరువయ్యే అవకాశం అయితే లేకపోలేదు. చూద్దాం.. ఏం జరుగుతుందో?

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?