Manchu Manoj: సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరో మోహన్ బాబు ఫ్యామిలీ కథే వేరు. ఎందుకంటే, గత కొంత కాలం నుంచి సినిమాల కంటే వివాదాల్లోనే ఎక్కువ నిలుస్తున్నారు. ఇంట్లో మాట్లాడుకోవాల్సిన విషయాలను నలుగురికీ తెలిసేలా మీడియా ముందుకు వచ్చారు. ఇక తమ్ముడు మంచు మనోజ్ కు అన్న విష్ణుకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. సినిమా ఫంక్షన్లో కూడా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా 9 ఏళ్ల తర్వాత మనోజ్ భైరవం అనే కొత్త మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాన్న మోహన్ బాబు గురించి సంచలన కామెంట్స్ చేశాడు.
Also Read: Bomb Threat Call: బెజవాడకు వరుస బాంబు బెదిరింపులు.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న పోలీసులు
మీ నాన్న ఒప్పుకోరా?
ఈ రోజు వరకు జరిగిండేదే జరిగింది.. నేను ఇంట్లోకి వస్తాను.. అందరికీ కలిసి ఉందాం అంటే మీ నాన్న ఒప్పుకోరా అని సీనియర్ జర్నలిస్ట్ అడగగా.. లైవ్ లోనే అతనికి మంచు మనోజ్ సవాల్ విసిరాడు. మీరు మాట్లాడండి మీకు కూడా చాలా పరిచయం. మీకు పరిచయమే కదా కొట్టండి కాల్. ఏం కాదులే ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడండి అంటూ గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడు.
Also Read: Theatres Strike Postponed: ఈ నెల 30 న కమిటీ సమావేశం.. పవన్ సినిమాకు ఇంకా ఎన్ని గండాలున్నాయి?
మీకు ధైర్యం ఉంటే ఫోన్ చేయండి?
అప్పుడు ఆ సీనియర్ జర్నలిస్ట్ ” తమ్ముడు వస్తానంటున్నాడు.. దగ్గరకు తీసుకోండి అని నేనే చెబుతా అని” అన్నాడు. హ వెళ్ళండి ఆ మాట చెప్పాక మిమ్మల్ని బాగా దగ్గరకు తీసుకుంటాడు.. అప్పుడు ఉంటాది సార్ అని మనోజ్ అన్నాడు. ఆ తర్వాత అతను మీరు భలే భయపెడుతున్నారంటూ కౌంటర్ వేశాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.