Mallu Ravi – Ponnam: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (Mallu Ravi) తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ మానసిక పరిస్థితి సరిగా లేదని మండిపడ్డారు. అందుకే రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమని అడుగుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తున్నందుకు రేవంత్ ను లొట్టపీసు ముఖ్యమంత్రి అంటున్నారా? అని నిలదీశారు.
మీ పార్టీ సంగతి చూసుకో!
గత పదేళ్లు బంగారు తెలంగాణ అని చెప్పి.. కేసీఆర్ తమ కుటుంబాన్ని బంగారం చేసుకున్నారని ఎంపీ మల్లు రవి ఆరోపించారు. కేసీఆర్ (KCR) దగ్గర దెయ్యాలు ఉన్నాయని కవిత అంటున్నారని.. మరి ఆ దెయ్యాలు ఎవరో చెప్పాలని కేటీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao), సంతోష్ (Santhosh), కవిత (kavitha) మధ్య అధికార పోరాటం జరుగుతోదని ఆరోపించారు. కేటీఆర్ ముందు వాళ్ళ పార్టీ సంగతి చూసుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ కొద్ది రోజుల్లో ముక్కలు ముక్కలుగా విడిపోతుందని ప్రజలకు అర్థమైందని కాంగ్రెస్ ఎంపీ అన్నారు.
ఈసారి.. చెప్పులకు పని చెప్తాం!
నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు రావడంపై కేసీఆర్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపైన కూడా ఎంపీ మల్లు రవి మాట్లాడారు. జాతీయ స్థాయి నాయకుడు కాబట్టే రేవంత్ రెడ్డి పేరు ఛార్జ్ షీట్ లో పెట్టారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఎవరి కాళ్లు పట్టుకొరని.. మరోమారు ఆ మాట అంటే చెప్పులకు పని చెప్పాల్సి ఉంటుందని ఘాటుగా సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు కోసమే సీఎం రేవంత్.. ప్రధాని, కేంద్రమంత్రులను సీఎం కలుస్తున్నారని మల్లు రవి స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రావడం లేదని అన్నారు.
Also Read: Minister Seethakka On KTR: కవిత చెప్పిన దెయ్యం అతనే.. సీతక్క సంచలన వ్యాఖ్యలు
దెయ్యాలను కనుక్కోండి!
కాంగ్రెస్ పై కేటీఆర్ చేసిన విమర్శలను మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సైతం తిప్పికొట్టారు. కవితను ను ఏమీ అనలేక కాంగ్రెస్ పై కేటీఆర్ మండిపతున్నారని అన్నారు. కాంగ్రెస్ మీద కేటీఆర్ మాట్లాడే కంటే వాళ్ళ చెల్లి మాట్లాడిన అంశాలపై ఆలోచన చేయాలని హితవు పలికారు. కవిత చెప్పిన కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో కనుక్కోవాలని సూచించారు. కేటీఆర్ వాళ్ల పార్టీ సమస్యను పరిష్కారించుకొని ఆపైన తమ గురించి మాట్లాడితే బాగుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.