Minister Seethakka On KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన.. సిస్టర్ స్ట్రోక్ కు కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయిందని అన్నారు. కాళేశ్వరంలో కమీషన్ తీసుకున్నప్పుడు లేని భయం.. కమీషన్ ముందుకు రావడానికి ఎందుకని ప్రశ్నించారు. గ్లోబెల్స్ ప్రచారంలో కేటీఆర్ ను మించిన వారు మరొకరు లేరని విమర్శించారు. అబద్దాల పునాదుల మీద బీఆర్ఎస్ నడుస్తోందని ఆరోపించారు.
ఆ దెయ్యం కేటీఆర్ కావొచ్చు!
తెలంగాణలో రాజకీయ దుమారం రేపిన కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు. కవిత చెప్పిన దెయ్యం కేటీఆరే కావొచ్చని వ్యాఖ్యానించారు. మరోవైపు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ కు లేదని సీతక్క అన్నారు. అటు కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ ఉన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ప్రధాని మోదీ ప్రశంసల కోసమే ఈడీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు గా ఉన్నప్పుడు ఈ కేసు బుక్ చేశారని చెప్పారు.
Also Read: KTR on Kavitha’s Letter: ఆ విషయాలు బయటకు చెప్పొద్దు.. కవితకు కేటీఆర్ వార్నింగ్!
తప్పుడు విమర్శలు మానుకో!
అబద్దాన్ని నిజం చేయడం కోసం కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను కేటీఆర్ మర్చిపోయారని విమర్శించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పై తప్పుడు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. నీతి, నిజాయితీ ఉంటే కాళేశ్వరం కూలేశ్వరం ఎందుకు అయిందో చెప్పాలని కేటీఆర్ ను నిలదీశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన పత్రికకు సహాయం చేస్తే తప్పా అంటూ నిలదీశారు.