Vallabhaneni Vamsi Health: వంశీకి సీరియస్.. స్టేషన్‌‌లో వాంతులు!
Vallabhaneni Vamsi Health (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Vallabhaneni Vamsi Health: వంశీకి మళ్లీ సీరియస్.. పోలీస్ స్టేషన్‌‌లో వాంతులు.. ఆందోళనలో ఫ్యామిలీ!

Vallabhaneni Vamsi Health: గన్నవరం మాజీ శాసనసభ్యుడు, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోమారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డారు. పరిస్థితిని గమనించిన పోలీసులు.. ఆయన్ను వెంటనే కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

హుటాహుటీనా ఆస్పత్రికి ఫ్యామిలీ!
వంశీ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకొని వెంటనే ఆయన భార్య పంకజశ్రీ.. కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. అటు వైసీపీ పార్టీ సైతం వంశీ అనారోగ్యం గురించి తెలుసుకొని అప్రమత్తమైంది. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani).. కంకిపాడు ఆస్పత్రికి వచ్చి వంశీ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. వైద్యులను అడిగి వివరాలు సేకరించారు.

చనిపోయేంతగా ఇబ్బంది పెడతారా?
అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని అర్ధరాత్రి మీడియాతో మాట్లాడారు. వంశీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు చెప్పారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టి.. మనిషి చనిపోయేంతగా ఇబ్బంది పెట్టడం దారుణమని అన్నారు. జైల్లో వంశీ వాంతులు చేసుకున్నారని.. విజయవాడకు సిఫార్సు చేస్తామని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. తప్పుడు కేసులతో విచారణ చేస్తే ప్రజలు హర్షించరని చెప్పారు. ఎవరిని కొట్టమంటే వారిని కొట్టే పరిస్థితుల్లో ప్రస్తుతం పోలీసులు ఉన్నారని ఆరోపించారు.

తిరిగి స్టేషన్ కు తరలింపు!
ఇదిలా ఉంటే శనివారం ఉదయం కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వంశీని తిరిగి పోలీసు స్టేషన్ కు తరలించారు. నేటితో వంశీ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు. కాగా 2019 ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్లపట్టాలు ఇచ్చారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో వంశీకి న్యాయస్థానం రిమాండ్‌‌ విధించింది

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..