BRS on Kavitha’s letter: గులాబీ పార్టీలో కోవర్టులు ఉన్నారని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్ మారాయి. అసలు ఎవరు అలా పనిచేస్తున్నా రు? పార్టీలో ఉంటూ ఇలాంటి వ్యతిరేక కార్య కలాపాలకు ఎవరు పాల్పడుతున్నారు? అనేది ఇప్పడు క్యాడర్, నాయకులు సైతం చర్చించు కుటుంన్నారు. అధినేత కేసీఆర్ నిత్యం ఫాం హౌస్ లో ఉండే నేతలే ఇలా వ్యవహరిస్తున్నారా? అనేది కూడా ఇప్పుడు చర్చకు దారితీసింది.
నాడు.. నేడు!
గులాబీ పార్టీ క్రమశిక్షణకు మారుపేరు. ఉద్యమ కాలం నుంచి పార్టీలో అంతర్గత వ్యవహారాలను, పార్టీ చేయబోయే కార్యక్ర మాలను చర్చించి గోప్యంగా ఉంచేవారు. పార్టీ కార్యక్రమం చేసేవరకు ఇతరులకు తెలిసేది కాదు. అయితే ఇప్పుడు క్రమశిక్షణ తప్పారా? అనేది చర్చ మొదలైంది. కేసీఆరు కవిత రాసిన లేఖ బయటికొచ్చింది. కవిత, కేసీఆర్ మధ్య మాత్రమే ఈ లేఖ ఉంటుంది. అయితే ఈ లేఖ 20 రోజుల తర్వాత ఎలా బయటకు వచ్చింది? అనేది హాట్ టాపిక్ అయింది. లేఖ గురించి మీడియాకు ఎలా తెలిసింది? ఇదంతా కావాలనే చేసినట్లుగా స్పష్టమవుతోంది. అదే విషయాన్ని కవిత సైతం మీడియా ముందు పేర్కొన్నారు. పార్టీలో కో వర్టులు ఉన్నారని, వీరితో ఎప్పటికైనా పార్టీకి నష్టమని తెలిపారు కూడా. పార్టీలో చిన్నచిన్న లోపాలను చర్చించుకొని, సవరించుకోవాల ని సూచించారు. అయితే కోవర్టులను మాత్రం తక్షణమే పార్టీ నుంచి బయటికి పంపాలని పదేపదే కోరారు. గోప్యంగా ఉండాల్సిన లేఖ ఎందుకు బయటకు తీసుకొచ్చారనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్న.
బయటికి వెళ్లగొట్టే ప్రయత్నమా?
కవిత అమెరికా నుంచి తిరిగి వస్తుందని తెలిసి ముందు రోజు మే 22న 5 పేజీల లేఖను మీడియాకు లీకు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్. కవితను టార్గెట్ చేసి ఈ లేఖను లీకు చేశారా? అనేది కూడా చర్చ జరుగుతోంది. లేకుంటే ఆమెను పార్టీ నుంచి బయటకు వెళ్లగా ట్టే ప్రయత్నమా? ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ కేసీఆరు నోటీసు ఇచ్చిన అంశాన్ని అటెన్షన్ వర్షన్ కోసం ఈ లేఖను తెరమీదకు తెచ్చారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. గతంలో ఎప్పుడు లేనిదీ ఇప్పుడు మాత్రమే లేఖను లీకు చేయడం వెనుక కారణం ఏమిటనేది అంత చిక్కని ప్రశ్నగా మారింది.ఇప్పటికేకవితరాజకీయంగా యాక్టీవ్ కావడం నచ్చక ఈ పని చేస్తున్నారా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్త పర్యటనలకు వెళ్లకుండా, పార్టీలో కీలక నేతగా ఎదగకుండా అడ్డుపడేందుకే సీక్రెట్ గా ఉండా ల్సిన లేఖను లీకు చేశారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.
Also Read: Kavitha: కేసీఆర్ దేవుడు.. చుట్టూ దయ్యాలు.. ఇంతకీ ఎవరు వాళ్లు?
బాస్ తో వాళ్లు మాత్రమే!
కేసీఆర్ పాటు ఫాం హౌస్ లో నలుగురు ఐదుగురు నేతలు నిత్యం ఉంటారు. అయితే వారే ఈ లేఖను బయటపెట్టారా? ఇంకెవరైనా బయటపెట్టారా? వారికి కాకుండా ఇంకా పార్టీలో ఎవరున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేసీఆర్ తో ఉండేవా రికి కాకుండా ఇంకెవరికి లేఖను బయట పెట్టడానికి అవకాశం ఉంటుంది? అసలు ఆ సాహసం ఎవరు చేస్తారు? అనేది కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా కవిత టార్గెట్ గా గోప్యంగా ఉండా ల్సిన లేఖను మీడియాకు లీకులు ఇచ్చారనేది స్పష్టమవుతోంది. ఆ లీకులు ఇచ్చిన వ్యక్తిని గుర్తించిపార్టీచర్యలు తీసుకుంటుందా?లేదా? అనేది చూడాలి. మరోవైపు కవిత లేఖను లీకు చేశారంటే పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చల సారాంశాన్ని సైతం ఇతర పార్టీలకు చేరవేసే అవకాశం కూడా లేకపోలేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.