ఒక్క రోజు కస్టడీలో శ్రవణ్ రావు
అధికారుల ప్రశ్నలేంటి? నిందితుడి సమాధానమేంటి?
ఐరన్ ఓర్ చీటింగ్ కేసులో మనీ ల్యాండరింగ్?
బినామీ కంపెనీల నుంచి రూ.30 కోట్ల ట్రాన్స్‌ఫర్
అదికూడా ఇండియాకు వచ్చే ముందే..
ఈడీ రంగంలోకి దిగితేనే వందల కోట్ల లెక్కలు బయటకొస్తాయా?
ఏడాది క్రితం ఏర్పడిన వైష్ణవి ఫెర్రో సాండ్స్ డైరెక్టర్లను గుర్తించారా?
అరెస్ట్ కాకుండా చూసుకుంటామని చేతులెత్తేసింది ఎవరు?
ఓ క్లబ్ అడ్డాగా చేస్తున్న లాబీయింగ్ సెక్సెసా? ఫెయిలా?
నిందితులందరూ బెయిల్ కోసం ట్రై చేస్తున్నారా?
ఫోన్ ట్యాపింగ్ ఫైల్ మళ్లీ కదిలేది ఎప్పుడు?
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్: సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు ఈమధ్యే చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. సీసీఎస్ పోలీసులు తాజాగా ఒక్క రోజు కస్టడీకి తీసుకున్నారు. ఐరన్ ఓర్‌తో లాభాలు వస్తాయని ఎంతో మందిని బురిడీ కొట్టించి శ్రవణ్ రావు కోట్లు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కరి ఫిర్యాదుతో అరెస్ట్ అయిన ఇతని చిట్టా ఒక్కొక్కటిగా బయటకొస్తున్నది. అయితే, తాను హైదరాబాద్ చేరుకునే రెండు రోజుల ముందు మార్చి 27న బినామీ కంపెనీల నుంచి వైష్ణవి ఫెర్రో సాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 30 కోట్లు ట్రాన్సఫర్ అయ్యాయి. ఇందుకు ఇన్‌రిథం ఎనర్జీ నుంచి 10 కోట్లు ఎకోర్ ఇండస్ట్రీస్‌కు వెళ్లాయి. అక్కడ 20 కోట్లు జమ అయి 30 కోట్లు ఏడాది క్రితం ఏర్పడిన కంపెనీకి వచ్చాయి. మైనింగ్‌లో మస్తు లాభాలు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ, బ్లాక్ మనీని వైట్‌గా మార్చేందుకు కూడా పనికొస్తుందని ఈ వ్యవహారం చూస్తేనే అర్థం అవుతుంది. 10 కోట్ల ముడి సరుకును ఇన్‌రిథం కొనుగోలు చేయాలంటే 20 వేల టన్నుల ముడి సరుకును ఎకోర్ నుంచి కొనుగోలు చేయాలి. ఈ కంపెనీ తన యాజమాన్యానికి, సిస్టర్ సంస్థలకు మాత్రమే నగదు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ, మరో కంపెనీకి 30 కోట్లు బదిలీ చేయడంపై అనుమానాలు తావిస్తున్నాయి. 10 కోట్ల పెట్టుబడి పెట్టిన ఏడాది కంపెనీకి ఆ తర్వాత డైరెక్టర్స్‌గా జాయిన్ అయిన ఇద్దరు తెలుగు వాళ్లు శ్రావణి కొసన, అజయ్ ఉప్పు కి ఎలాంటి లావాదేవీలు ఉన్నాయో సీసీఎస్ పోలీసులు శ్రవణ్ రావు నుంచి ఆరా తీసినట్లు సమాచారం.
Read Alo-Kavitha: కేసీఆర్ దేవుడే కానీ.. ఉసూరుమనిపించిన కవిత..!
ఈడీ ఎంట్రీ తప్పదా?
కోట్లాది రూపాయలను మైనింగ్‌లో పెట్టుబడులు పెట్టించిన శ్రవణ్ రావు, వివిధ కంపెనీల్లో లావాదేవీలకు లెక్కలు లేవని తెలుస్తున్నది. ఓ మాజీ మంత్రి వద్ద ఉన్న బ్లాక్ మనీని వైట్ చేసేందుకు అనేక ఆర్థిక పన్నాగాలు పన్నినట్లుగా సమాచారం. వివిధ కంపెనీలకు మనీ ల్యాండరింగ్ జరిగినట్లు సీసీఎస్ విచారణలో బయటపడుతుందని తెలుస్తున్నది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఎంట్రీ అవుతుందా? బినామీల పేర్లపై కొద్ది రోజుల్లోనే మోసాలకు పాల్పడ్డ డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసి కంపెనీలు అంటూ కలరింగ్ ఇచ్చింది తేలుస్తారా అనేది ఆసక్తిగా మారింది. ఒక్కరే ఫిర్యాదు చేశారు, చీటింగ్ కేసు మాత్రమే చూస్తామని హైదరాబాద్ పోలీసులు మమ అనిపిస్తే అసలు లెక్కలు బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఈడీ రంగంలోకి దిగితేనే అన్నీ బయటకు వస్తాయని బాధితులు అనుకుంటున్నారు.
Read Alo- Covid panic: హైదరాబాద్‌లో కొవిడ్ కలకలం – వైద్యుడికి పాజిటివ్!
ఆ క్లబ్ సాక్షిగానే సెటిల్మెంట్స్?
జూబ్లీహిల్స్‌లో ఓ పేరొందిన కబ్ల్ నిర్వాహకులు శ్రవణ్ రావు కేసుని హ్యాండిల్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఫోన్ ట్యాంపిగ్ కేసులో కూడా అరెస్ట్ కాకుండా భారీగానే ముడుపులు తీసుకున్నారని, నేరుగా శ్రవణ్ రావే తన సన్నిహితులతో చెప్పినట్టు తెలిసింది. తమ సామాజిక వర్గం కాబట్టే ఈ కేసులను ఫాలో అప్ చేస్తున్నామని వారంతా హామీ ఇచ్చినట్లు కూడా శ్రవణ్ అన్నట్టు సమాచారం. చీటింగ్ కేసులో ఏప్రిల్ 25న ఎఫ్ఐఆర్ అయినా, మే 13న విచారణకు పిలిచేంత వరకు తాను అరెస్ట్ కానని ఆ సామాజిక వర్గం కాపాడుతుందని ధీమాగా ఉన్నట్లు ఇటీవల ములాఖత్‌లో కలిసిన వారితో అన్నట్టు సమాచారం. తాజా విచారణలో పోలీసుల పాత్రని సైతం డిసైడ్ చేసే ఆ క్లబ్ నిర్వహాకుడి హామీని పంచుకోవడంతో జూబ్లీహిల్స్‌లో కొత్త కలవరం మొదలైంది.
బెయిల్ కోసం మిగితా నిందితులు
ఇప్పటికే శ్రవణ్ రావు భార్య స్వాతి రావు యాంటిస్పెయిర్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించింది. మిగితా నిందితులైన వేదమూర్తి, ఉమా మహేశ్వర్ రెడ్డి కర్ణాటక కోర్టులో ట్రాన్సిస్ట్ బెయిల్ అప్లై చేసుకున్నారు. ప్రధాన నిందుతుడిని కస్టడీ పూర్తి అయిన తర్వాత మిగితా నిందితులను విచారించి, మైనింగ్ మాఫియా వెనుక జరిగిన బ్లాక్ మనీ దందాను బయటపెడుతారా? బినామీ కంపెనీల వ్యవహారం ఏంటో తేలుస్తారా? వందల కోట్లు పెట్టుబడి రూపంలో తీసుకుని వివిధ కంపెనీలకు పంపిస్తున్న వ్యవహారాన్ని పసిగడతారా? ఈడీకి సహకరించేలా సీసీఎస్ పోలీసులు ఒక్క కేసు అని కాకుండా అనేక మంది తేలు కుట్టిన బాధితులు ఉన్న వారిని కూడా గుర్తిస్తారా? అనేది ఛార్జిషీట్‌తో తేలనుంది. ఈ కర్ణాటక మైనింగ్ బినామీ కేసుల్లోకి ఈడీ ఎంట్రీ అయ్యేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
Read Alo-Kavitha: కేసీఆర్ దేవుడు.. చుట్టూ దయ్యాలు.. ఇంతకీ ఎవరు వాళ్లు?