Thank You Dear
ఎంటర్‌టైన్మెంట్

Thank You Dear: ‘థాంక్ యూ డియర్’ ఫస్ట్ లుక్ చూశారా!

Thank You Dear: యువ హీరో ధనుష్ రఘుముద్రి నటించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘థాంక్ యూ డియర్’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో గ్రాండ్‌‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు ఆశీస్సులు అందించారు. ఈ సినిమా ధనుష్‌కు మంచి గుర్తింపు తెస్తుందని, యువ బృందం చేసిన ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.

Also Read- Atlas Cycle Attagaaru Petle: ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’.. ఇదందయ్యా ఇది!

ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ.. ‘థాంక్ యూ డియర్’ ఇది నా రెండో సినిమా. తమ్మారెడ్డి వంటి సీనియర్ ప్రొడ్యూసర్ మా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా నా కెరీర్‌లో చాలా కీలకమైనది. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఎంతో నమ్మకంతో ఉన్నాం. ఈ సినిమాకు అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. దర్శకుడు మంచి ప్లానింగ్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఇందులో ఉన్నాయని తెలిపారు.

Also Read- Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏదో రకంగా కాంట్రవర్సీ కోరుకుంటున్నాడా?

నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రం ధనుష్‌కు గొప్ప పేరు తెస్తుందని, తమ్మారెడ్డి లాంటి ప్రముఖులు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం తమకు ప్రోత్సాహకరంగా ఉందని తెలిపారు. సినిమా ప్రేక్షకులను ఆకర్షిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. లైన్ నిర్మాత పుణీత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ్మారెడ్డి భరద్వాజ వంటి పెద్దలు ఈ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం సంతోషకరమని, సినిమాను ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించామని అన్నారు. ఈ చిత్రం యువతని కచ్చితంగా ఆకట్టుకొని విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని వెల్లడించారు.

Also Read- Bigg Boss Beauty: ఇదెక్కడి అరాచకం రా అయ్యా.. ఏకంగా నైటీతో ఆ షోకి వచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర ప్రముఖులు మాట్లాడుతూ, సినిమా ఘన విజయం సాధించాలని కోరారు. కాగా.. హెబా పటేల్, ధనుష్ రఘుముద్రి, రేఖ నిరోషా, వీర శంకర్, నాగ మహేష్, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్, బలగం సుజాత, సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు ఈ చిత్రంలో నటిస్తున్న తారాగణం. ప్రస్తుతం ఈ చిత్ర ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు