CM Revanth On KCR (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

CM Revanth On KCR: అసెంబ్లీకి రండి.. అద్భుతాలు సృష్టిద్దాం.. కేసీఆర్‌కు సీఎం విజ్ఞప్తి

CM Revanth On KCR: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రూ.100 కోట్లతో నిర్మించిన జహీరాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జి.. మాచనూర్ లో రూ.26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం పస్తాపూర్ బహిరంగ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

గత పాలనలో నిమ్జ్‌కు అన్యాయం
ఉమ్మడి మెదక్ జిల్లాకి ఇందిరమ్మ (Indira Gandhi)కి విడదీయరాని అనుబంధం ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇందిరమ్మ చివరిశ్వాస వదిలినప్పుడు ఆమె మెదక్ ఎంపీ (Medak MP)గా ఉన్నారని గుర్తుచేశారు. చరిత్ర ఎప్పుడూ మెదక్ జిల్లాని గుర్తు పెట్టుకుంటుందని అన్నారు. గీతా రెడ్డి (Geetha Reddy) జహీరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిమ్జ్ (NIMZ) వచ్చిందని రేవంత్ గుర్తు చేశారు. గత ప్రభుత్వ పాలనలో నిమ్జ్ ప్రాజెక్టు అన్యాయానికి గురైందని అన్నారు. తాను సీఎం అయ్యాక ఈ విషయాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha)తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. అన్యాయానికి గురవుతున్న నిర్వాసిత రైతులకు వెంటనే నష్టపరిహారం పెంచాలని ఆదేశించినట్లు రేవంత్ అన్నారు.

వారికి ఇందిరమ్మ ఇండ్లు
నిమ్జ్ లో భూములు కోల్పోతున్న 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భూములు కోల్పోతున్న వారికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) న్యాయం చేస్తారని అన్నారు. వారికి ఇళ్ల పట్టాలు అందించే బాధ్యత జగ్గారెడ్డికి అప్ప చెబుతున్నట్లు సీఎం అన్నారు. వారికి మంచి భోజనం పెట్టించి జగ్గారెడ్డి పట్టాలు ఇస్తారని స్పష్టం చేశారు. జహీరాబాద్ (Zaheerabad) అభివృద్ధి కోసం ప్రత్యేక సమీక్ష చేసి నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

రైతులకు అప్పుల నుంచి విముక్తి
సంగారెడ్డికి ఆనుకొని ఉన్న పటాన్ చెరు ప్రాంతం మినీ ఇండియా ప్రాంతమని సీఎం రేవంత్ అన్నారు. BHEL, BDL, NIMZ, ఇక్రిశాట్ ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో వచ్చినవేనని స్పష్టం చేశారు. సింగూరు నుంచి మంజీరా జలాలు హైదరాబాద్ దాహార్తిని తీరుస్తున్నాయని చెప్పారు. సింగూరు ప్రాజెక్టును టూరిజం హబ్ గా మారుస్తామని సీఎం హామీ ఇచ్చారు. మరోవైపు రాష్ట్రంలోని రైతులకు అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించామని సీఎం అన్నారు. రైతు భరోసాని రూ. 12 వేలకు పెంచి సహాయం అందిస్తున్నామని చెప్పారు.

వరి పంటకు బోనస్
ఆనాడు వరి వేసుకుంటే ఉరే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. కానీ నేడు వరి పంటకు బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు. 18 నెలల్లో మహాలక్ష్మి పథకం కోసం రూ.5,500 కోట్లు కేటాయించామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. మిస్ వరల్డ్ కాంపిటీషన్ కి వచ్చిన వారు.. మన ఆడబిడ్డలు చేసిన వస్తువులను చూశారని రేవంత్ అన్నారు. మహిళలే బస్సులు కొని ఆర్టీసీకి కిరాయి ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

ఉద్యోగ, ఉపాధి కోసం చర్యలు
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న యువతకు గత పదేళ్లుగా ఉద్యోగాలు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను ముందున్నాన్న వ్యక్తి ఇంట్లో మాత్రం.. అందరికి ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కోసం ప్రధాని మోదీని ఎన్ని సార్లు అయిన కలుస్తానని రేవంత్ స్పష్టం చేశారు.

Also Read: TDP on Jagan: మీరు తెచ్చిన బ్రాండ్లు.. మీరే మర్చిపోతే ఎలా.. జగన్‌పై టీడీపీ సెటైర్లు!

40ఏళ్ల అనుభవం పంచుకోండి!
చెరువు మీద అలిగితే మనకే వాసన వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకతను అలాగే అలిగి ఫామ్ హౌస్ లో పడుకున్నారని పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష రాజకీయ నాయకులు అసెంబ్లీకి రావాలని సీఎం పిలుపునిచ్చారు. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని తమకు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా? అని ప్రశ్నించారు. తాము పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడాలని రేవంత్ అన్నారు. తాను ఏ రోజు సీఎంగా అహంకారానికి పోలేదని.. మీరు అండగా ఉంటే అద్భుతాలు చేస్తామని పరోక్షంగా కేసీఆర్ కు సూచించారు. ప్రపంచంలోనే తెలంగాణను గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పిలుపునిచ్చారు.

Also Read This: Kavitha Letter: కవిత మరో షర్మిల.. లేఖ వెనక సీఎం రేవంత్.. మెదక్ ఎంపీ

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు