Actress Snigdha: నటి స్నిగ్ద అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. తెలుగు ఆడియెన్స్ ఈమె సుపరిచితురాలే.. ఈ పేరు తెలియకపోవచ్చు.. కానీ, ఆమె ఫేస్ చూస్తే ఈజీగా గుర్తుపడతారు. స్టార్ హీరో నాని నటించిన అలా మొదలైంది మూవీలో నాని ఫ్రెండ్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకుని స్టార్ హీరోస్ చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి అందర్ని మెప్పించింది. అలా అలా మొదలైంది హిట్ అవ్వడంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను తెగ నవ్విస్తుంది. అయితే, రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జెండర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఏం మాట్లాడిందో ఇక్కడ తెలుసుకుందాం..
నా జెండర్ అదే!
చూడటానికి అబ్బాయిలా ఉండే ఈ అమ్మాయి జెండర్ చాలా మందికి ఓ సందేహం ఉంది. స్నిగ్ద అమ్మాయా? అబ్బాయా? అని. అయితే, ఇదే ప్రశ్నను ఓ యాంకర్ అడగగా.. దానికి జవాబు గట్టిగానే చెప్పింది. నేను అమ్మాయినే.. అబ్బాయిని కాదు. ప్రతి నెల నాకు కూడా పీరియర్డ్స్ వస్తాయి. నేను అందరి లాగే ప్యాడ్స్ కొనుక్కుంటానని తెలిపింది.
Also Read: Kumari Aunty: మీకో దండంరా బాబు.. నన్ను వదిలేయండి.. మొత్తం మీరే చేశారంటున్న కుమారి ఆంటీ
అందుకే అబ్బాయిలా రెడీ అవుతా?
అప్పుడు యాంకర్ మరి ఎందుకు అబ్బాయి స్టైల్ ని మెయింటైన్ చేస్తున్నావ్ అని అడగగా .. నాకు అదే మంచిగా ఉంటుంది. షర్ట్, ప్యాంట్ వేసుకుంటే ఫ్రీగా వేసుకుంటుందని ఆమె మాటల్లో చెప్పింది.
ఆ ఉద్దేశం లేనే లేదు?
వయస్సు నలబై దాటిన ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదని యాంకర్ అడగగా.. ఆమె వెంటనే నో నేను చేసుకోను అని చెప్పింది. ఇంత వరకు ఎప్పుడూ పెళ్లి గురించి ఆలోచించలేదు. అలాగే, మ్యారేజ్ చేసుకుంటే వేరొకరి కంట్రోల్లో ఉండాలి.అది మన వల్ల కాదు. నాకు అలాంటి జీవితం వద్దు అని చెప్పింది. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.