Thug Life Press Meet
ఎంటర్‌టైన్మెంట్

Kamal Haasan: ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు.. ఇది నా ప్రామిస్!

Kamal Haasan: ఇండియన్ సినీ ఆడియెన్స్ ఈ సంవత్సరం ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి ‘థగ్ లైఫ్’. కమల్ హాసన్ హీరోగా.. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది. ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్‌గా మంచి స్పందనను రాబట్టుకొన్న విషయం తెలిసిందే. హీరో నితిన్ ఫాదర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. గతంలో ‘విక్రమ్, అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఈ సంస్థ ఇప్పుడు ‘థగ్ లైఫ్’‌ను భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది.

Also Read- Vijay Kanakamedala: మెగాభిమానులకు క్షమాపణలు చెప్పిన ‘భైరవం’ దర్శకుడు

ఈ కార్యక్రమంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఒక దర్శకుడిగా మణిరత్నం ‘నాయకుడు’ సినిమాతో ఎలా అయితే అందరినీ సర్‌ప్రైజ్ చేశారో.. ‘థగ్ లైఫ్’తో కూడా ఆయన ప్రేక్షకులను మెప్పించబోతున్నారు. నన్ను ఆయన ద్రోణాచార్యతో పోల్చారు. కానీ నేను ద్రోణాచార్యుడిని కాదు. నేను ఇంకా విద్యార్థినే. ఒకరికి నేర్పాలంటే ముందు మనం నేర్చుకోవాలి. నా వరకు నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మీరు కూడా నాతో పాటు కలిసి నేర్చుకోండి. నేను మణిరత్నం సినిమాలో యాక్ట్ చేయను, జస్ట్ బిహేవ్ చేస్తానంతే. మేమంతా సినిమా అభిమానులం. సినిమాని ఎప్పుడూ కూడా భుజాలపై మోస్తాం. నాజర్ ఆల్ రౌండర్. మేము ఎప్పటినుంచో జర్నీ చేస్తున్నాం. ‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమాకి తనికెళ్ల భరణి పని చేయాల్సింది. కానీ అది కుదరలేదు. ఆయనతో కలిసి మరింత ప్రయాణం చేయాలని ఉంది. ఆయన ఇంకా ఎక్కువ రాయాలని కోరుకుంటున్నాను.

Also Read- Peddi: ‘పెద్ది’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్‌కి పండగే!

శింబు చైల్డ్ వుడ్ నుంచి చేస్తున్న సినిమాలను నేను చూస్తూనే ఉన్నాను. నేను కూడా చైల్డ్ యాక్టర్ నుంచే జర్నీ స్టార్ట్ చేశాను. అందుకే మేము ఎంతగానో కనెక్ట్ అయ్యాం. ఏదైనా సినిమానే మాకు నేర్పింది. నేను అందుకే ఇంకా సినిమా విద్యార్థిగానే నన్ను నేను చెప్పుకుంటాను. నేను మనసుపెట్టి చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయాన్ని సాధించింది. ఈ ‘థగ్ లైఫ్’ కూడా నేను మనసుపెట్టి చేసిన సినిమా. అభిరామి మళ్ళీ ఈ సినిమాలో నటించినందుకు హ్యాపీ. ఇది ఒక ఫెంటాస్టిక్ టీమ్‌తో చేసిన సినిమా. గొప్పగా సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇది. ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు. అందుకే సినిమాని ప్రమోట్ చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమా ‘నాయకుడు’ కంటే పెద్ద విజయం సాధిస్తుంది. ఇది నా ప్రామిస్. ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్ అప్పటి నుంచి నాకు ఎక్జయిట్‌మెంట్ ఉంది. ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. నేను తెలుగులోనే స్టార్‌గా ఎదిగాను. స్టార్‌గా నేను పుట్టిన ఇల్లు ఏదయ్యా అంటే తెలుగు అనే చెబుతాను. అందుకు తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాను. ఇంత మంచి సినిమా తరచూ రాదు. అందుకే నా శక్తి వంచన లేకుండా ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. జూన్ 5న సినిమా థియేటర్లలోకి వస్తోంది. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. అందరూ సినిమా చూసిన తర్వాత మరింత గొప్పగా సెలబ్రేట్ చేసుకుందామని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ