Kavitha: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం కలిగించే పరిణామం చోటుచేసుకున్నది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావును ప్రశ్నిస్తూ సొంత కుమార్తె, ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఇప్పుడీ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ డాడీ.. అంటూ కవిత ఆరు పేజీల లేఖ రాశారు. పార్టీ లీడర్స్‌కు యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత ఆరోపించారు. ఆఖరికి బీజేపీతో పొత్తుపై కూడా సిల్వర్‌జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదని ప్రశ్నించారు. పాజిటివ్, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అంటూ కవిత లేఖ రాయడం గమనార్హం. కాగా, కేసీఆర్ ఫ్యామిలిలో వారసత్వ పోరు జరుగుతోందని ‘స్వేచ్ఛ’ డైలీలో సంచలన కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.
Read Also-BRS Party: అంతా నేనే.. పార్టీ నాదే.. తెగేసి చెప్పిన కేటీఆర్.. కవిత, హరీశ్ బిగ్ ప్లాన్!
పాజిటివ్ ఫీడ్ బ్యాక్ :
1. సీఎం రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చిన అంశం
2. సీఎం తిడుతున్నా మీరు హుందాగా ఉన్నారు
3. పోలీసులకు ఇచ్చిన వార్నింగ్ కూడా బాగుంది
4. బీఆర్ఎస్ సభతో క్యాడర్ నైతికంగా బలపడింది
5. ఆపరేషన్ కగార్ మీద మాట్లాడటం చాలా నచ్చింది
6. కాంగ్రెస్ ఫెయిల్ అని చెప్పిన తీరు సూపర్
7. పెహల్గాం అమరులకు నివాళి- మౌనం బాగుంది
8. రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చిన అంశం
నెగిటివ్ ఫీడ్ బ్యాక్ :
1. ఉర్దూలో ఎందుకు మాట్లాడలేదు నాన్నా..?
2. వక్ఫ్ బిల్లు మీద మాట్లాడి ఉంటే బాగుండేది
3. బీసీలకు 42 శాతం కోటా అంశం విస్మరించారు
4. ఎస్సీ వర్గీకరణపై నోరు విప్పలేదు
5. మళ్లీ పాత ఇన్‌ఛార్జ్‌లకే లోకల్ బాడీస్ బీఫారమ్ ఇస్తారా?
6. 2001 నుంచి ఉన్నవాళ్లకు స్టేజ్‌పై ఎందుకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు?
7. బీజేపీపై రెండే నిమిషాలు మాట్లాడటం అనుమానాలకు తావిస్తోంది
8. బీజేపీ వల్ల నేను చాలా బాధపడ్డాను
9. బీజేపీని ఇంకాస్త టార్గెట్ చేస్తే బాగుండేది
ఇక వేరు కుంపటేనా?
వాస్తవానికి బీఆర్ఎస్, పార్టీ పెద్దలు పట్ల కవిత తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని ప్రచారం జోరుగానే జరుగుతున్నది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ఇలా లేఖ బయటికి రావడం గమనార్హం. అయితే ఈ లేఖ నిజంగానే కవిత రాశారా? లేకుంటే మరొకరు రాసి ఇలా చేస్తున్నారా? అనేదానిపైన పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కవిత తన అభిప్రాయాన్ని ఇలా లేఖ ద్వారా చెప్పారనే కొందరు చెబుతున్నా.. కవితకు కేసీఆర్ దగ్గర మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఎందుకిలా లేఖ రాస్తారు? అనే విషయం ఎవరికీ అర్థం కావట్లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కవిత తీహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా పరిణామాలే చోటుచేసుకున్నాయని ఇన్‌సైడ్ టాక్. అందులో ముఖ్యంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని కేటీఆర్ ఆదేశించారని, అన్నయ్య మాటలకు విలువ ఇవ్వకుండా కవిత వరుస సమావేశాలు, బీసీ రాగం ఎత్తుకున్నారనే చర్చ గట్టిగానే నడుస్తున్నది. ఈ క్రమంలోనే కేసీఆర్ దగ్గరికి వెళ్లేందుకు డోర్లు అన్నీ క్లోజ్ కావడంతోనే ఇలా లేఖ ద్వారా తన మనసులోని మాటలను బయటపెట్టారనే చర్చ సైతం జరుగుతున్నది. ఇవన్నీ ఒకెత్తయితే ఎన్నోరోజులుగా కవిత వేరే పార్టీ పెడతారనే దానికి ఇలా లేఖ రాయడం ప్రాధాన్యత ఇస్తోంది. అయితే ఈ పరిస్థితుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను కాదని వేరు కుంపటి పెట్టడం పక్కా అనే ప్రచారం జరుగుతున్నది. కవిత మనసులో ఏముందో.. చివరికి ఏం జరుగుతుందో చూడాలి మరి.