brs party
సూపర్ ఎక్స్‌క్లూజివ్

BRS Party: అంతా నేనే.. పార్టీ నాదే.. తెగేసి చెప్పిన కేటీఆర్.. కవిత, హరీశ్ బిగ్ ప్లాన్!

  • తండ్రి వారసత్వం నాకే
  • కూతురు, అల్లుడి పెత్తనం ఏంటి?
  • ఎవరి దారి వారు చూసుకున్నా ఫర్వాలేదు
  • ఫుల్ క్లారిటీ ఇచ్చిన కేటీఆర్?
  • అవమానాలపై కవిత 5 పేజీల లేఖ
  • ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్న హరీశ్
  • అమెరికాలో సెటిల్మెంట్ జరగనుందా?
  • కొత్త పార్టీలు పెట్టేది ఎవరు?

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల


BRS Party: భారత రాష్ట్ర సమితి (BRS) ని భాగాలుగా పంచుకునేందుకు వారసులు సిద్ధమయ్యారు. వారసత్వంగా వచ్చే పార్టీ నాదంటే నాదంటూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. దీంతో అంతర్గత పోరు తారస్థాయికి చేరినట్లు సమాచారం. గతంలో కేసీఆర్ (KCR) ఫాలో అయిన సిద్దాంతాన్నే నమ్ముకుని బలంగా ముందుకు వెళ్లాలని కేటీఆర్ (KTR) భావిస్తున్నారు. ఇదే క్రమంలో అవమానాలతో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంటని మిగిలిన రెండు పిల్లర్స్ పక్కదారి వెతుక్కుంటున్నాయి. కేటీఆర్‌కు అంత సీన్ లేదని పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇదేం పద్దతి అంటూ వారి దారులు వారు చూసుకుంటున్నట్లు జరుగుతున్న పరిణామలు కనిపిస్తున్నాయి.

ఆ 5 పేజీల్లో ఏముంది?


తన తండ్రి కేసీఆర్‌కు కవిత (Kavitha) 5 పేజీల లేఖాస్త్రం సంధించారు. కాలుకు గాయమైందని చెప్పుకుంటూ చేసే కుట్ర రాజకీయాలతో పాటు, తాను తెలంగాణ కోసం కాలుకి బలపం కట్టుకుని తిరుగుతున్న విషయాలను అందులో పొందుపర్చినట్లు సమాచారం. రాజకీయ పరిపక్వత లేని వాళ్లకు పార్టీ అప్పగిస్తే ఏం జరిగిందో, ఏం జరగబోతుందో భవిష్యత్ వాణి వినిపిస్తూ, అందులో తన అభిప్రాయాలను కవిత రాసినట్లు విశ్వసనీయ సమాచారం. చాపకింద నీరులా చుట్టుకొస్తున్న సమస్యలు ఏంటి? ఎదుర్కొనేందుకు తామెలా పని చేయాలో చెప్పాల్సిన అధ్యక్షులు మౌన వ్రతం చేయడంపై కూడా సున్నితంగా ప్రశ్నించినట్లు తెలిసింది.

Read Also- CPI Narayana On Nagarjuna: హీరో నాగార్జునపై సీపీఐ నేత సంచలన ఆరోపణలు.. బాబోయ్ మరీ ఈ స్థాయిలోనా!

సభ్యత్వాల ఆలస్యం అందుకేనా?

కేసీఆర్ చెప్పినట్లు బీఆర్ఎస్ సభ్యత్వాల నమోదు పక్రియ మే 1 నుంచి ఊపందుకోవాలి. కానీ ఒక అడుగు ముందుకేస్తే, పది అడుగులు వెనక్కి లాగినట్లు సభ ఏర్పాట్ల క్రెడిబులిటీని క్యాచ్ చేసుకున్న నేతలు ఆ తర్వాత నోరెత్తడం లేదు. ఇంట్లో పంచాయితీ తెగే వరకు లాగడమే అన్నట్లుగా కేటీఆర్ వ్యవహారశైలి ఉండడం వెనుక అనేక ఉదహరణలు ఉన్నాయని తెగ మాట్లాడుకుంటున్నారు. స్థానిక పార్టీల్లో సమ బలమైన నేతలు ఎప్పుడైనా ప్రమాదకరమని గ్రహించి, ఉంటే రాజకీయాలు, లేదంటే వెళ్లిపోవడం అనేవి ఇప్పుడే తేలాలని బీష్మించి కూర్చున్నారని తెలుస్తున్నది. అందుకే ఏ సభ్యత్వాలు, సంస్థాగత బలోపేతాలు లేకుండానే పార్టీని స్లీపింగ్ మోడ్‌లోకి నెట్టేశారని సమాచారం.

హరీశ్ ఓపిక నశించిందా?

మామ అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు ఎన్ని అవమానాలు అయినా బరించి పార్టీ కోసం పనిచేస్తానని హరీశ్ రావు (Harish Rao) ఎప్పుడో మాట ఇచ్చారు. రజతోత్సవ సభ అంతా కేటీఆర్ సక్సెస్ చేశారని క్రెడిట్ సాధించుకుంటున్నారు. దానికి తోడు అడుగడుగునా అడ్డంకులు ఎదురవ్వడంతో ప్రజల తరుఫున ప్రశ్నించకుండా, పార్టీని పట్టుకుని ఉంటే ఏం ఉపయగం అని డిసైడ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకు ఏఏ పార్టీలతో వెళ్లాలి కొత్త పార్టీ పెడితే ఎదురయ్యే సమస్యలు ఏంటి? ఇతర పార్టీల అసంతృప్తులను ఎలా కలుపుకుని పోవాలి. ప్రత్యేక పార్టీ నేషనల్ పార్టీల సపోర్ట్ ఎలా ఉండబోతుంది? పేరు టీఆర్ఎస్ వచ్చేలా ఉండేందుకు నామకరణం చేస్తే ప్రజల్లోకి వెళుతుందా? కాంగ్రెస్ మరోసారి రాదనే వాదనతో ఎలాంటి ప్రజా సమస్యలను ఎత్తుకుని వెళ్లాల్సి ఉంటుందో అంతర్గతంగా హరీశ్ రావు సతమతం అవుతున్నట్టు తెలుస్తున్నది.

అమెరికాలో సెటిల్మెంట్?

కాంగ్రెస్ సోషల్ మీడియా ఇప్పటికే కొత్త పార్టీ అంటూ, బీఆర్ఎస్ బీటలు అంటూ ప్రచారం మొదలు పెట్టడంతో, హరీశ్ రావు అచితూచి పకడ్బందీగా నిర్ణయాలు తీసుకోవాలని ప్లాన్ వేసుకుంటున్నట్లు సమాచారం. గతంలో మాదిరిగా బావ బావమరిది బయటకు వేరులా కనిపించి, అంతా ఒక్కటే అనే సీన్ ఇప్పుడు కనిపించకపోవడంతో హరీశ్ తన దారిని వెతుక్కుంటున్నట్లు స్పష్టమవుతున్నది. మొత్తానికి కేటీఆర్ నేనే పార్టీ, నాదే పార్టీ అంటూ కొత్త వాదం ఎత్తుకోవడంతో పాటు హరీశ్ రావు బీజేపీ నిర్ణయాలను పొగడడం, కవిత సామాజిక న్యాయం అంటూ హడావుడిగా కొత్త రాగాలు తీయడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. పైగా, 16న కవిత, 22న కేటీఆర్, ఏక్షణమైనా కేసీఆర్ అమెరికా వెళ్తున్నారు. అక్కడే ఈ సెటిల్మెంట్ వ్యవహారం ఉండనున్నట్టు సమాచారం.

Read Also- Miss World 2025: ప్రపంచ సుందరులు వచ్చారు.. ప్రజలకు మాత్రం ఎల్ఈడీ స్క్రీన్‌ పరిమితం?

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?