Bigg Boss Beauty: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి టీవీ షోలు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటాయి. ఇంకో వైపు టాక్ షోలు కూడా హిట్ అవుతున్నాయి. సెలబ్రిటీలు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు? ఎన్ని కష్టాలు పడ్డారు? వారి నోటి నుంచే చెప్పించే టాక్ షోలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అయితే, ప్రస్తుతం ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ‘కాకమ్మ కథలు సీజన్ 2’ అనే టాక్ షో మిలయన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఈ తేజస్వి మదివాడ యాంకర్ గా చేస్తోంది. అయితే, తాజాగా నాలుగో ఎపిసోడ్ కు సంబందించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు.
Also Read: Actor Sumanth: ఆమె వచ్చి అడిగితే.. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటున్న సుమంత్.. పెళ్లి గురించేనా?
నాలుగో ఎపిసోడ్ బుల్లితెర ఫ్రెండ్స్ ప్రేరణ కంబం, యష్మీ గౌడ సందడీ చేశారు. తేజస్వి షో స్టార్టింగ్లో ” ఈ రోజూ మా కాకమ్మ పొద్దు పొద్దున్నే లేచి జాగింగ్ కి వెళ్తే పార్క్ లో ఒక ఆంటీ కనిపించింది అంట.. ఆమెను లాక్కొని ఇక్కడికి తీసుకొచ్చింది. ఇంకొక అమ్మాయి కాలేజీ బస్ ఎక్కుతుంటే దానిని క్యాచ్ చేసి తీసుకొచ్చిందంటూ యష్మీ గౌడ ఇన్వైట్ చేసింది.
తేజస్వి మాట్లాడుతూ.. ప్రేరణను మొన్న నేను కలిసి .. ఏమ్మా ప్రేరణ నా షో కి వస్తున్నావ్ కదా అని అడిగితే.. తను ఎలా రావాలని అడిగింది. ఇంట్లో ఎలా ఉంటావో అలాగే రా అని చెప్పా.. ఇలా వచ్చింది అంటూ నైటీలో ఉన్న ప్రేరణను చూపించింది.
Also Read: Actress Saiyami Kher: బెడ్ ఎక్కితేనే ఆఫర్ ఇస్తా అన్నాడు.. సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ సంచలన కామెంట్స్
తను వేసుకున్న డ్రస్ ఇండియన్ నేషనల్ ఆంటీ యూనిఫామ్ అని మాట.. కానీ, నువ్వు ఒకటి చెప్పు నేను చాలా మంది తేడా వాళ్ళని కలిశాను. నువ్వు నా షో కే ఎందుకు నైటీ వేసుకుని వచ్చావని తేజస్వి అడిగింది. అప్పుడు ప్రేరణ జస్ట్ ఇంట్లో కూర్చొని మాట్లాడినట్టు మాట్లాడితే సరిపోతాది అన్నావ్ గా.. మరి, దీని కన్నా నా దగ్గర బెటర్ డ్రస్ లేదని ఫన్నీగా చెప్పింది.