TDP vs Janasena: ఏపీలో టీడీపీ – జనసేన ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. సీఎంగా చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మధ్య మంచి అనుబంధమే ఉన్నప్పటికీ క్యాడర్ స్థాయిలో అది కనిపించడం లేదు. టీడీపీ – జనసేన శ్రేణులు తరుచూ గొడవలు పడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. వారిని పార్టీ అధిష్టానం బుజ్జిగిస్తూ కూటమిలో చీలికలు రాకుండా ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో శ్రేణుల మధ్య ఉన్న ఘర్షణ నేతల వరకూ పాకినట్లు తెలుస్తోంది. తాజాగా ఒంగోలు మహానాడులో జనసేన ముఖ్యనేతపై టీడీపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి.
ఒంగోలులో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు మరోమారు భగ్గుమన్నాయి. స్థానికంగా నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో.. టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ (Damacharla Janardhana Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంగోలుకు చెందిన జనసేన నేత బాలిలేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy)పై విమర్శలు గుప్పించారు. గతంలో చేసిన తప్పులను మరిచి ఏదో ఒక పార్టీ అంటూ జనసేనలో చేరారని జనార్థన్ ఆరోపించారు. రోజుకోక పదవి పేరు చెబుతూ వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు.
ఒంగోలు మహానాడులో టీడీపీ vs జనసేన
మహానాడులో హాట్ కామెంట్స్ చేసిన టీడీపీ నేత జనార్దన్
మాజీ మంత్రి బాలినేనిపై సెటైర్లు
గతంలో చేసిన తప్పులను మరిచి ఏదో ఒక పార్టీ అంటూ జనసేనలో చేరారన్న జనార్దన్
ఒకరోజు ఎమ్మెల్సీ, మరో రోజు నాలుగు జిల్లాలకు ఇన్ఛార్జ్ అంటూ వేషాలు వేస్తున్నారంటూ… pic.twitter.com/jhzii0NS4M
— BIG TV Breaking News (@bigtvtelugu) May 22, 2025
ఏదోక గొడుగు కింద ఉండాలన్న ఉద్దేశ్యంతోనే బాలినేని జనసేనలో చేరారని టీడీపీ నేత దామచర్ల జనార్థన్ అన్నారు. ఆ పార్టీలో ఉంటూ ‘పది రోజుల్లో నాకు ఎమ్మెల్సీ వస్తుంది.. ఆ పది రోజులు అయ్యాక మంత్రి అయిపోతున్నా.. ఆ పది రోజులు దాటాక పార్టీలో 4 జిల్లాలకు హెడ్ అవుతున్నా’ అని బాలినేని చెప్పుకొని తిరుగుతున్నారని ఆరోపించారు. పార్టీ మారడం ఏమోగాని ఒంగోలును సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీకి చెందిన మహిళలను బాలినేని కొట్టించారని అన్నారు. టీడీపీ శ్రేణులపై కేసులు పెట్టించారని చెప్పారు. ఈ పాపాలు అన్ని ఊరికే పోవని ఈ జన్మలోనే అనుభవించాల్సి ఉంటుంది హెచ్చరించారు.