CPI Kunamneni Sambasiva Rao(image credit twitter)
తెలంగాణ

CPI Kunamneni Sambasiva Rao: ఎన్ కౌంటర్లు అప్రజాస్వామికం.. ఆపరేషన్ కగారు ను నిలిపివేయాలి!

CPI Kunamneni Sambasiva Rao: ఛత్తీస్‌గఢ్ లో సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తో సహ మరో 27 మంది మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. శాంతి చర్చలకు సిద్ధమేనని మావోయిస్టులు ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా ఎన్ కౌంటర్లు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు.

సమాజంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయ వాదులు, మేధావులు రచయితలు తక్షణమే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్నప్పటికీ కేంద్రం మొండివైఖరి ప్రదర్శించడాన్నీ తీవ్రంగా ఖండించారు. ఎలాంటి సమస్యకైనా చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చరిత్ర రుజువు చేస్తుందని అన్నారు. తక్షణమే ఆపరేషన్ కగారు నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పేందుకు కేంద్రం ముందుకు రావాలని కోరారు.

Also Read: CM Revanth Reddy: కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు.. సీఎం సంచలన కామెంట్స్!

నర మేదానికి స్వస్తిపలకాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
అమాయక ప్రజలపై సాగిస్తున్న నర మేదానికి కేంద్రం స్వస్తిఫలకాలని సీపీఎం రాష్ట్ర జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు తో పాటు 27 మందిని కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. ఒకవైపు మావోయిస్టులు చర్చలు జరుపుదాం.. శాంతియుతంగా పరిష్కరిద్దాం, ఆయుధాల విషయాన్ని కూడా చర్చలు జరుపుదామని కేంద్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశాయని, లేఖలు రాశాయన్నారు.

అయినా ప్రభుత్వం మూర్ఖంగా మావోయిస్టులను అదేవిధంగా మావోల పేరుతో గిరిజనులను కాల్చి చంపే నరహంతక చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఛత్తీస్ ఘడ్ అడవుల్లో కార్పొరేట్ సంస్థలకు అక్కడ ఉండే ఖనిజ సంపాదనంతా దారాదత్తం చేయడానికి ఆటంకంగా మావోయిస్టులు ఉండటంతోనే ఇలాంటి చర్యలకు కేంద్రం పాల్పడుతుందని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల చర్చల ప్రతిపాదన పై సానుకూలంగా స్పందించి శాంతియుత వాతావరణానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: BRS Harish Rao: దేశానికి ఆదర్శంగా తెలంగాణ.. మాజీ మంత్రి హరీష్ రావు!

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?