Actor Sumanth: బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి టీవీ షోలు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటాయి. ఇంకో వైపు టాక్ షోలు కూడా హిట్ అవుతున్నాయి. సెలబ్రిటీలు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు? ఎన్ని కష్టాలు పడ్డారు? వారి నోటి నుంచే చెప్పించే టాక్ షోలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అయితే, ప్రస్తుతం ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ‘కాకమ్మ కథలు సీజన్ 2’ అనే టాక్ షో మిలయన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఈ తేజస్వి మదివాడ యాంకర్ గా చేస్తోంది. అయితే, తాజాగా ఐదో ఎపిసోడ్ కు సంబందించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు.
Also Read: Romantic Movie: ఒక్క మూవీలో 20 లిప్ కిస్ సీన్లు.. వరల్డ్ వైడ్ గా అతిపెద్ద డిజాస్టర్ ఇదే!
అయితే, ఈ సీజన్ ఐదో ఎపిసోడ్ కు హీరో అక్కినేని సుమంత్, అవసరాల శ్రీనివాస్ వచ్చి సందడీ చేశారు. తేజస్వి మాట్లాడుతూ మిమ్మల్ని 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. మీరు ఇప్పటికీ కూడా అందంగానే ఉన్నారు. మీ సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్పొచ్చు కదా అంటూ సుమంత్ ను అడిగింది. ఇదేదో బాగానే ఉంది నేనేదో ఇంజెక్షన్ చేపించుకున్నట్టు అలా చూపిస్తున్నావ్ ఏంటని ఫన్నీగా కౌంటర్ ఇచ్చాడు.
Also Read: Kumari Aunty: మీకో దండంరా బాబు.. నన్ను వదిలేయండి.. మొత్తం మీరే చేశారంటున్న కుమారి ఆంటీ
సుమంత్ ను ప్రశ్నిస్తూ.. పున్నమి వెన్నెల్లో, గోదావరి, చక్కని చుక్క, ఏమో గుర్రం ఎగరావచ్చు ఈ వర్డ్స్ అన్నిటినీ కలిపి ఒక లైన్ చెప్పాలంటూ తేజస్వి అడగగా.. అయితే, దీనికి ఆసక్తికర ఆన్సర్ ఇచ్చాడు. ” పున్నమి వెనెల్లో ఒక చక్కని చుక్క నా దగ్గరికి వచ్చి గోదావరి పార్ట్ 2 చేయోచ్చు కదా అని అడిగింది. ఏమో గుర్రం ఎగరావచ్చు అని చెప్పాను” అని అన్నాడు. అయితే, అందరూ రెండో పెళ్లి గురించేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
