MP Mallu Ravi: త్వరలో బీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ పొత్తు..
MP Mallu Ravi(image credit:X)
Political News

MP Mallu Ravi: త్వరలో బీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ పొత్తు.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

MP Mallu Ravi: తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తో కలిసి BRS ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు . వచ్చే ఎన్నికల్లో బీజేపీ, BRS, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయని ఎంపీ అన్నారు.

ముగ్గురు కలిసి ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ ప్రజా ప్రభుత్వమే వస్తుందని అన్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. చట్టానికి అందరూ సమానమేనని.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టానికి అతీతులా? ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళారు.

Also read: Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపైకి నీరు.. ప్రజలు ఇక్కట్లు!

బీహార్ లో లాలు ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లలేదా? కేసీఆర్, హరీష్, ఈటెల కమిషన్ ముందు హాజరు కావాలి. నోటీసులు అందకపోవడం మనం ఏమైనా అమెరికాలో ఉన్నామా? విద్యుత్ కమిషన్ విషయంలో కేసిఆర్ తప్పు చేశారు. ఇప్పుడైనా కాళేశ్వరం కమిషన్ కు సహకరించాలని, ఎవరెన్ని కుట్రలు చేసినా .. అవినీతికి పాల్పడ్డవారు జైలుకెళ్లడం ఖాయం అని అన్నారు.

Just In

01

Kavitha: లేబర్ చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం : కవిత

Panchayat Elections: ప్రశాంతంగా ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు.. మూడు విడత ఎన్నికల్లో 85.77 శాతం పోలింగ్​ నమోదు!

Seethakka: గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి : మంత్రి సీతక్క

David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్ చూశారా?.. మంచు మనోజ్ చెప్పేది వింటే ఏమైపోతారో?

Jinn Movie: ‘జిన్’ అలా ఇలా భయపెట్టడు.. థియేటర్లలో ఒక్కొక్కరికి! నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు