MLA Gangula Kamalakar: తెలంగాణ సమాజం నిన్న ఉలిక్కి పడ్డది. తెలంగాణ సాధించిన కేసీఆర్ కు నోటీసులివ్వడంతో తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు, ఇది యావత్ తెలంగాణ సమాజానికి ఇచ్చిన నోటీసులని, కాళేశ్వరం ప్రాజెక్టు కింద పంటలు పండించుకున్న రైతులకు ఇచ్చిన నోటీసులని, బీఆర్ఎస్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కు నోటిసు ఇచ్చి పైశాచిక ఆనందం పొందుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మేడి గడ్డ బ్యారేజ్ కాదు అనేక పంపులు, బ్యారేజ్లు, రిజర్వాయర్ల, కాలువలు, టన్నెల్స్ సమాహారమని, మేడిగడ్డ 85 పిల్లర్స్‌లో మూడు కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం విఫలమైనట్టేనా అని అన్నారు. మార్చి 13, 2024 లో ఘోష్ కమిషన్ వేసి వంద రోజుల్లో రిపోర్ట్ ఇవ్వడానికి గడువు పెట్టారు. చాలా గడువుల పెంపు తర్వాత మే 31 లోగా రిపోర్టు ఇస్తామని ఘోష్ చెప్పారు. ఇంకా ఎవరిని పిలవం విచారణ పూర్తయ్యిందని ఘోష్ స్వయంగా చెప్పారు.
రేవంత్ రెడ్డి ఒత్తిడి మేరకే ఘోష్ తన వైఖరి మార్చుకుని కేసీఆర్, హరీష్ రావులకు నోటిస్ లు ఇచ్చారని గంగుల కమాలాకర్ అన్నారు. వారికి నోటీసులు చేరక ముందే మీడియాకు లీకు లిచ్చారు. ఈ నోటీసులు పూర్తిగా రాజకీయ దురుద్దేశం, కక్షతో కూడుకున్నవి. ఇల్లు కట్టినపుడు బాత్రూంలో లీక్ అయితే మొత్తం ఇల్లు కూలగొడుతామా, బస్సు టైర్ పాడయితే బస్సునే కాల పెడతామా అంటూ ఎద్దేవ వేశాడు. తెలంగాణలో సమైక్య పాలన నాటి రోజులు తేవాలనేదే రేవంత్ కుట్రచేస్తున్నాడు. తెలంగాణ ప్రాజెక్టులు ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లు మలపాలనేదే రేవంత్ కుట్ర అని ఈ నోటీసులకు బెదరం అదరమని గంగుల కమాలాకర్ అన్నారు.
Also Read: MP Mallu Ravi: త్వరలో బీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ పొత్తు.. కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గ్రామాలలోకి వెళ్లలేని పరిస్థితి ఉంది. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది. హామీల వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ కు నోటీసులిచ్చారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్ముతారని రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు. ఇపుడు అవే అబద్దాలు చెబుతున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు, అటెన్షన్ డైవెర్ట్ రాజకీయమే కాదు. గోదావరి నీళ్లు తెలంగాణకు దక్కకుండా చేసే కుట్ర జరుగుతోందని, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ లేకుండా చేస్తే ఏపీకి గోదావరి నీళ్లు తరలించే కుట్ర జరుగుతోంది. పోలవరం డయాఫ్రమ్ వాల్ కూలిపోతే విచారణ ఎందుకు చేయలేదు? ఎస్ ఎల్ బీ సీ టన్నెల్ ప్రమాదం జరిగితే కమిషన్ లేదు. సుంకి శాల కూలిపోతే కమిషన్ లేదు. వట్టెం పంప్ హౌజ్ మునిగినందుకు కమిషన్ లేదు. కేసీఆర్ కు ఎందుకు నోటీసులు ఇస్తారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మాజీ మంత్రి సత్యవతీ రాథోడ్
కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచున ఉంది పాలన చేతకాక సమస్యలు పరిష్కరించడం చేత కాక కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి సత్యవతీ రాథోడ్ అన్నారు. కాళేశ్వరం ఓ సఫల ప్రాజెక్టు ఎస్ ఆర్ ఎస్ పి ప్రాజెక్టు చివరి ఆయకట్టు దాకా నీళ్లు రావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు యే కారణమని, కేసీఆర్ తెలంగాణ ప్రతిష్ట పెంచితే రేవంత్ పరువు తీస్తున్నారని అన్నారు. అందాల పోటీలతో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్. అందాల పోటీల్లో విదేశీ వనితల కాళ్ళు కడిగి తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని అన్నారు. సీఎం సొంత గ్రామంలో చిన్న గుడి ప్రారంభం కోసం మంత్రివర్గం అంతా వెళ్ళింది. మూడు హెలికాఫ్టర్లు వాడి ప్రజా ధనం దుర్వినియోగం చేశారని అన్నారు. గిరిజనులకు రేవంత్ చేసిందేమి లేదు కేసీఆర్ కుటుంబం పై రేవంత్ కక్ష గట్టారు. రేవంత్ తాటాకు చప్పుళ్ల కు కేసీఆర్ బెదిరడని అన్నారు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
రేవంత్ రెడ్డి సీఎంగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు. సీఎం పదవి వచ్చింది కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడానికి కాదని రేవంత్ గ్రహించాలని, ఈ నోటీసు 70 లక్షల రైతులకు ఇచ్చినట్టుగానే భావిస్తున్నామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. సముద్రంలో కలిసే గోదావరి జలాలను వాడుకుని తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం కట్టారు. కాళేశ్వరం కూలిపోయిందని రేవంత్ దివాళా కోరు ప్రచారం చేస్తున్నారు. ఈ విష ప్రచారం మాను కోవాలని, రేవంత్ సీఎం అయ్యాక ఏన్నో ప్రమాదాలు జరిగాయి వాటన్నిటి పై కమిషన్ లు వేశారా, కేసీఆర్ కుటుంబ సభ్యులను రాజకీయంగా వేధించాలన్న రేవంత్ పప్పులు ఉడకవు అని సుదీర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కలిసి కట్టుగా ఉండటం జీర్ణించుకోలేకనే నోటీసుల డ్రామాకు రేవంత్ తెరలేపారు. ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు.
Also Read: Komatireddy Venkat Reddy: కేటీఆర్ తండ్రి చాటు బిడ్డ.. రాజకీయం తెలీదు.. కోమటిరెడ్డి సెటైర్లు