International Yoga Day: ఏపీ చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీ కారం చేడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.10వ ప్రపంచ యోగ దినోత్సవంను గనంగా నిర్వహించాలని అన్నారు. యోగా అనేది మనకి చాలా ఏళ్లుగా ఉంది. ప్రపంచానికి యోగా నీ ప్రచారం చేసింది ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 21 ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. యోగా అనేది మనిషికి బెటర్ లివింగ్ కి ఉపయోగ పడుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి మెకానికల్ గా మారడు. అన్నింటికి యోగా పరిష్కారమని, ప్రజల జీవన శైలిలో యోగా అంతర్ భాగం గావుండాలని అన్నారు. జూన్ 21న ప్రపంచ యోగ దినోత్సవం వైజాగ్ లో నిర్వహిస్తున్నామని సీఏం తెలిపారు.
Also Read: Shadnagar BJP party: బీజేపీ కార్యాలయం అద్దె చెల్లించక 40 నెలలు.. యజమాని ఆవేదన!
ప్రపంచం లోనే మంచి గుర్తింపు తెచ్చేలా నూతన రికార్డు సృష్టించే లా నిర్వహిస్తామని, కనీసం10 లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు ఇస్తామని సీఏం చంద్రబాబు తెలిపారు. వైజాగ్ లో 5 లక్షల మంది ఆర్ కె బిచ్ లో, మొత్తం 2 కోట్ల మంది ఒకేసారి యోగా చేస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2047 విజన్ లో ఆరోగ్యన్ని కీలకంగా చేశామని, యోగా పాజిటివ్ థింకింగ్ అలవాటు చేస్తుందని రోజు ఒక గంట పాటు చేస్తే మనకు ఎలాంటి వత్తిడి ఉన్నా తగ్గి పోతుందని అన్నారు. ఇది పోటీ ప్రపంచం ప్రతి ఒక్కరు పోటీ పడి పని చేస్తున్నారు. యోగా కోసం ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు పని చేస్తున్నాయని గుర్తుచేశారు.
100 టూరిస్ట్ కేంద్రాల్లో ఏర్పాట్లు
యోగాంధ్ర కోసం ఈ రోజు నుంచి జూన్ 21న వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా పై ప్రచారం నిర్వహిస్తామని సీఏం చంద్రబాబు అన్నారు. యోగాకోసం 100 టూరిస్ట్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ 30 రోజులు ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలని కోరుతున్నానని, యోగాను పూర్తి స్థాయిలో ప్రమోట్ చేయాలి. ఈ నెల రోజులు పాటు పెద్ద ఎత్తున యోగాపై విస్తరణ ప్రచారం చేస్తామిని సీఏం తెలిపారు. ఈ నెల రోజులు పాటు అన్ని చోట్ల యోగా కార్యక్రమాలు చేస్తామని, 2 కోట్ల మంది జూన్ 21న రాష్ట్ర వ్యాప్తంగా యోగా చేసేలా ప్రణాలికలను సిద్దం చేస్తున్నామని అన్నారు.
Also Read: DCM Pawan Kalyan: రోహింగ్యాల వలసలతో అంతర్గత భద్రతకు ప్రమాదం.. డిప్యూటీ సీఎం!
ప్రతి స్కూల్లో విద్యార్థులతో యోగా చేపిస్తామని, యోగా నీ స్కూల్లో పాఠ్యాంశంగా చేరుస్తా. జూన్ 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్ లో యోగా నిర్వహిస్తామని అన్నారు. ప్రధాని మోదీ యోగా నీ ప్రజలకు అందించాలని తపన పడుతున్నారని, రాగ ద్వేషాలకుశాల కతీతంగా యోగ ఉంటుందని అన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ నెంబర్ 2 గా ఉండాలన్నారు. ప్రపంచానికి సేవలు అందించే స్థాయిలో నేడు భారత్ ఉంది. కాభట్టి మనిషికి యోగా గేమ్ చేంజర్ లాంటిదని, యోగా దినోత్సవం నా జీవితంలో అతి పెద్ద ఈవెంట్ గా చేయాలని భావిస్తున్నానని సీఏం చంద్రబాబు అన్నారు. దీని పై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు,ఉద్యోగులు అందరినీ యోగాలో బాగా స్వాముల చేస్తామని సీఏం చంద్రబాబు అన్నారు.