Minister Seethakka: పర్యావరణ హితంలో ప్రజల అభివృద్ధి కోణంలో, వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు walta అథారిటీలను నియమించాలని, సహజ వనరులను దుర్వినియోగం చేయకుండా అవసరం మేరకే వినియోగించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సీతక్క తెలిపారు. నీటిని అధికంగా వినియోగించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి దుర్వినియోగంపై అన్ని శాఖలు దృష్టి సారించాలి. నిపుణులు, శాస్త్రవేత్తలు పర్యావరణ వేత్తలతో కలిసి విధి విధానాలు రూపొందించాలని అన్నారు. నీటిని సంరక్షించాలని ప్రజలకు అవగాహన కల్పించాలి. అందుకోసం ప్రభుత్వ పాఠశాలలను, మార్కెట్ యార్డులను, రైతు వేదికలను ప్రచార కేంద్రాలుగా వాడుకోవాలని అన్నారు. మన శరీరంలో నీరు తగ్గిపోతే మన ప్రాణాలకే ప్రమాదమని, అదేవిధంగా భూగర్భంలో నీరు అడుగంటితే మానవాళి మొత్తానికి ప్రమాదం అని అన్నారు.
వారం రోజులపాటు ప్రత్యేక డ్రైవ్
రాష్ట్రంలో మొక్కుబడిగా అవగాహన కార్యక్రమాలు చేయడం వల్ల ఉపయోగం లేదు, గత పది ఏళ్లలో వాల్టా అథారిటీ సమావేశాలు నిర్వహించకపోవడం అన్యాయం, పర్యావరణం, హరిత తెలంగాణ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు తప్ప ప్రణాళిక బద్ధంగా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు కృషి చేయలేదని మంత్రి శీతక్క అన్నారు. వాల్టా చట్టం పై వారం రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. ప్రజల భాగస్వామ్యాన్ని విస్తృతంగా పెంచాలని, నీటిని అధికంగా వినియోగిస్తున్నారని కొన్ని ప్రాంతాలపై ఆంక్షలు పెడితే ఉపయోగం ఉండదని, కొత్తగా బోర్లు వేయవద్దని అధికారులు ఆంక్షలు పెట్టినా ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండదు. అందుకే నీటి కొరత తలెత్తితే జరిగే ప్రమాదంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. భవిష్యత్తు తరాల కోసం నీటిని అవసరం ఉన్నంత మేరకు వినియోగించేలా కళాకారులతో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని స్థాయిల్లో వాల్ఠారిటీలను క్రియాశీలం చేయాలని, ఎంపీలు ఎమ్మెల్యేలు స్థానిక అధికారులతో కమిటీలు వేసి సమావేశాలు పెట్టాలని మంత్రి సీతక్క తెలిపారు.
Also Read: MP Bandi Sanjay: అందాల పోటీలపై ఉన్న శ్రద్ద పుష్కరాలపై లేదా?.. ప్రభుత్వంపై బండిసంజయ్ ఫైర్!
చట్టాన్ని ఉల్లంఘిస్తే కటిన చర్యలు
ప్రతి మూడు నెలలకు ఒకసారి విధిగా వాల్టా అథారిటీలు సమావేశం అయ్యేలా చర్యలు చేపట్టాలి. భూగర్భ జలాలు తగ్గిపోతున్న గ్రామాల్లో ఏ స్థాయిలో జలాలు ఉన్నాయో జనాలకు తెలిసెలా చేయాలని, భూగర్భ జలాల స్థాయిని గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్ గా విభజించి గ్రామాలు ఏ జోన్లో ఉన్నాయో గ్రామ పంచాయతీ గోడల మీద రాయాలని అన్నారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా వాల్టా నిదిని ఏర్పాటు చేస్తామని, పర్యావరణ హితం కోసం వాల్టానిధిని ఖర్చు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తున్న వారి పై కటిన చర్యలు తీసుకుంటామని, ఇంకుడు గుంతలు, వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని అన్నారు. 10 సంవత్సరాల్లో వాల్టా అథారిటీ సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని, ఒక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం ద్వారా పర్యావరణం పట్ల తమ అసలు రంగును గత పాలకులు బయటపెట్టుకున్నారని అన్నారు. మేము భవిష్యత్ తరాల కోసం పర్యావరణహితం కోసం వాల్టా చట్టాన్ని అమలు చేస్తాము. ఆకుపచ్చ తెలంగాణ కోసం, పాడి పంటల తెలంగాణ కోసం వాల్టా చట్టాన్ని అమలు చేస్తాం వాల్టా, ప్రజల ప్రయోజనాలు వేరు కాదని మంత్రి శీతక్క అన్నారు. ప్రజలు, రైతుల సంక్షేమ కోణంలో వాల్టా చట్టాన్ని అమలు చేయాలని, వాల్టా రాష్ట్రస్థాయి అథారిటీ మొదటి సమావేశంలో కొన్ని తీర్మాణాలు చేసారు.
సమావేశంలో తీర్మాణాలు
జిల్లాస్థాయి, డివిజనల్ స్థాయి, మండల స్థాయి వాల్టా అథారిటీల ఏర్పాటు, భూగర్భ జలాలు ప్రమాదకరస్థాయిలో తగ్గుతున్న గ్రామాల్లో, పట్టణాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేయడం. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలని అన్నారు. వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణంను తప్పనిసరి చేయాడం. వాల్టానిధి ఏర్పాటు చేయాలని క్యాబినెట్ కు సిఫార్సు, గ్రామాల వారీగా నీటి వనరులు, బోర్లు, బావుల సమాచార సేకరణ, వాల్టా యాక్ట్ అమలును హైడ్రాకూ వర్తింప చేయాలనే అంశాలపై తీర్మాణాలు చేశారు.
Also Read: Painting Scam: జీహెచ్ఎంసీలో పెయింటింగ్ స్కాం..