Rashi Khanna: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రాశిఖన్నా ( Rashi Khanna) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో దాదాపు యంగ్ హీరోస్ అందరితో చేసింది. ఇప్పుడు తెలుగులో అవకశాలు తగ్గాయి. హిందీ, తమిళ్ లో దూసుకెళ్తుంది. ఇక తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి ” తెలుసు కదా ” అనే చిత్రంలో నటిస్తుంది. అలాగే, బాలీవుడ్ లో కూడా ఓ మూవీ చేస్తుంది. అయితే, తాజాగా రాశిఖన్నా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: RV Karnan: ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి.. అధికారులకు కర్ణన్ కీలక ఆదేశాలు!
రాశిఖన్నా షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లు ఉంది. అయితే, దీనికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. కొన్ని రోల్స్ అడగవు, చేయాలని డిమాండ్ చేస్తాయి.. అప్పుడు చేయాల్సిందే. వేరే ఆప్షన్ ఉండదు అంటూ మీ శరీరం, శ్వాస, మీ గాయాలు.. తుఫానుగా మారినప్పుడు, ఉరుములు నిన్ను ఏం చేయలేవు.. కమింగ్ సూన్ అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఈ ఫోటోలలో రాశి ముక్కు నుంచి రక్తం కారుతుంది. అంతే కాదు, కాళ్లకు, చేతులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం బాలీవుడ్ మూవీ షూటింగ్ లో జరిగినట్లు సినీ వర్గాల వారు చెబుతున్నారు.
అయితే, ఈ ఫోటోలు చూసి చాలా మంది అయ్యో అంత పెద్ద ప్రమాదం జరిగిందా అంటూ సెలబ్రిటీలు కూడా షాక్ అవుతున్నారు. ఇక ఫ్యాన్స్ తో మా హీరోయిన్ కు ఏమైంది? ముక్కులో నుంచి రక్తం రావడం ఏంటని కామెంట్లలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొందరు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.