Kaleshwaram Commission( iamge credit: twitter)
తెలంగాణ

Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు.. కేసీఆర్, హరీష్ రావును విచారించే అవకాశం?

Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ గడువు మరో రెండునెలలు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 31 వరకు పొడగిస్తూసోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 31తో కమిషన్ పదవీకాలం ముగియనుంది. బహిరంగ విచారణను ముగించినట్లు కమిషన్ కమిషన్ ప్రకటించింది. ఈ నెల మూడోవారంలో నివేదికను ప్రభుత్వానికి అందజేయనుందని లీకులు సైతం ఇచ్చింది.

అయితే ప్రభుత్వం మాత్రం మరోరెండునెలలు కమిషన్ పదవికాలం పెంచి అందరికీ షాక్ ఇచ్చినట్లు అయింది. రాజకీయ నాయకుల విచారణ లేకుండానే కమిషన్ ఇచ్చేందుకు కమిషన్ సిద్ధమైంది. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కమిషన్ పదవీకాలం పెంపుతో మళ్లీ విచారణ కొనసాగించే అవకాశం ఉంది. కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ను విచారించేందుకే కాళేశ్వరం కమిషన్ పదవీకాలం పొడిగించారని సమాచారం.

Also Read: Abdullahpur Met mandal: కబ్జాలపై కలెక్టర్‌ సీరియస్.. నాకేం సంబంధం లేదన్న ఎమ్మెల్యే!

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ ల నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో కమిషన్ ను నియమించింది. 100రోజుల్లో నివేదిక ఇస్తామని ప్రకటించినా అధికారుల విచారణ ముగియకపోవడంతో కమిషన్ గడువు పెంచుతూ వచ్చింది. ఈ నెల 31 వరకు గడువు ఉన్నది. బహిరంగ విచారణకు పొలిటికల్ లీడర్లను విచారణకు పిలువొద్దని కమిషన్ భావించింది. లీగల్ సమస్యలు రాకూడదనే ఉద్దేశ్యంతో వీరిని విచారణకు పిలువకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

డాక్యుమెంట్ ఆధారాఅలతో కమిషన్ ఫైనల్ రిపోర్టు ఇచ్చేందుకు సిద్ధమైంది. 400 పేజీలతో కమిషన్ రిపోర్టు తయారు చేసింది. అయితే పొలిటికల్ లీడర్లు కేసీఆర్, హరీష్ రావు, ఈటలను విచారణ కు పిలవాలని కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరిని విచారణకు పిలవకుండా నివేదిక ఇస్తే చెల్లుబాటు కాదని కమిషన్ మళ్లీ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. సహజ న్యాయ సూత్రాల కు విరుద్దంగా వెళ్లరాదని కమిషన్ యోచించినట్లు సమాచారం. అయితే కేసీఆర్ ను విచారణకు ఎప్పుడు పిలుస్తారనేదిఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విచారిస్తారా? లేకుంటే మళ్లీ కాలయాపనతోనే కాలం వెళ్లదీస్తారా? అనేది చూడాలి.

Also Read: MP Bandi Sanjay: అందాల పోటీలపై ఉన్న శ్రద్ద పుష్కరాలపై లేదా?.. ప్రభుత్వంపై బండిసంజయ్ ఫైర్!

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు