MP Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ద పుష్కరాలపై లేదని, సరస్వతి నది పుష్కరాలకు రూ.35 కోట్లు ఏ మూలకు సరిపోతాయి. పుష్కరాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ సతీసమేతంగా సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానమాచరించి సరస్వతి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ముక్తేశ్వరుడిని, సరస్వతి దేవిని దర్శించుకున్నారు. కాళేశ్వరం వచ్చిన బండి సంజయ్ కుమార్ కు వేద పండితులు, జిల్లా అధికారులు, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ అందాల పోటీలకు ప్రాధాన్యత ఇవ్వండి కాదనడం లేదు కానీ ఆ పోటీల నిర్వహణపై ఉన్న శ్రద్ద కోట్లాదిమంది భక్తుల ఆధ్యాత్మికత కు ప్రతిబింబంగా నిలిచే పుష్కరాలకు ఎందుకు ఎవ్వరు.
Also Read: Jangaon District Congress: కాంగ్రెస్‌లో మరోసారి భగ్గుమన్న వర్గ విభేదాలు!
సరస్వతి పుష్కరాలకు రూ.35 కోట్లు ఏ మూలకు సరిపోతాయని బండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పుష్కరాల నిర్వహణలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా ప్రభుత్వం ఫెయిలైందన్నారు. కుంభమేళాలో 50 కోట్ల మంది భక్తులకు అక్కడి బీజేపీ ప్రభుత్వం అద్బుతమైన ఆతిధ్యమిచ్చింది అన్నారు. సరస్వతి పుష్కరాలకు వచ్చే 50 లక్షల మంది భక్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేకపోఉందన్నారు. బీజేపీ అధికారంలో ఉంటే పుష్కరాలను దక్షిణాది మొత్తం పండుగలా నిర్వహించే వాళ్లమన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి కాళేశ్వరాన్ని అద్బుతమైన అధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్డాలని బండి సంజయ్ కుమార్ కోరారు.
Also Read: Medchal murder Case: ఆశ్రయమిస్తే అంతం చేశాడు.. మహిళ గొంతు, చెవి, ముక్కు కోసి.. దారుణం!