KCR And KTR
తెలంగాణ, సూపర్ ఎక్స్‌క్లూజివ్

KCR: కేసీఆర్ స్కెచ్.. కేటీఆర్ అమలు.. ఫైనల్‌గా ఏమైంది?

KCR: కేసీఆర్ నయా స్కెచ్ వేశారు.. పార్టీపై, నేతలపై రోజుకో తీరుగున్న జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్టవేసేందుకు పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. మీడియా దృష్టిని ఎప్పటికప్పుడు ఆకర్షిస్తున్నారు. ప్రభుత్వంపై కన్నా ప్రతిపక్షం బీఆర్ఎస్ పైనే చర్చ జరిగేలా చర్యలు చేపట్టారు. కేసీఆర్ ప్లాన్‌ను అక్షరాలా కుమారుడు కేటీఆర్ అమలు చేశారు. హరీష్ రావు ఇంటిలో భేటీలు నిర్వహించి పార్టీపై, కేసీఆర్ కుటుంబంపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టనివారణకు పక్కా స్కెచ్ వేశారు.. ఇంతకీ ఏమిటా కథ!


Read Also-Tirupati: పవిత్ర పుణ్యక్షేత్రంలో మహా పాపం.. ఏం జరిగిందంటే?

గులాబీ బాస్ స్కెచ్ వేస్తే..
రాజకీయ వ్యూహాలు రచించడంలో గులాబీ అధినేత కేసీఆర్ దిట్ట. ఆయన స్కెచ్ వేస్తే పక్కాగా సక్సెస్ అవుతుంది. ఆ విషయం రాజకీయ నాయకులకు, విద్యావేత్తలకు, పార్టీలోని నేతలకు సైతం తెలుసు. అయితే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత పార్టీలు కొంత స్తబ్దత ఏర్పడింది. ఈ మధ్యకాలంలో పార్టీ యాక్టీవిటీస్‌ను ముమ్మరం చేసింది. అయితే పార్టీపై కూడా అదేస్థాయిలో సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారం పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావించిన కేసీఆర్.. దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. హరీష్ రావును పక్కకు పెట్టారని, ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం విస్తృతం కావడంతో పార్టీ కేడర్‌లోనూ కొంత గందరగోళం నెలకొంది. పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన పార్టీ అధినేత కేసీఆర్ అటెన్షన్ డైవర్షన్ చేయాలని భావించినట్లు సమాచారం. ప్లాన్ వేశారు.. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని అటెన్షన్ డైవర్షన్‌కు తెరలేపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కేటీఆర్‌ను స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్లి మాట్లాడాలని సూచించడంతో ఆయన వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. రెండ్రోజులు కేటీఆర్ వరుసగా వెళ్లారు. తాజారాజకీయాలు, పార్టీపై జరుగుతున్న దుష్ప్రాచారానికి అడ్డుకట్టవేసేందుకు సుదీర్ఘంగా చర్చించారు. కలిసి ముందుకుపోవాలని, పార్టీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వంపై పోరాటానికి సన్నద్ధం కావాలని నిర్ణయించారు. తమకుటుంబంలో విభేదాలు లేవని కలిసి కట్టుగా ఉన్నామనే సందేశం పార్టీ కేడర్ కు ఇచ్చారు.


KTR And KCR

తొలిసారి హరీష్ రావు ఇంట్లో..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హరీష్ రావు (తెలంగాణ కట్టప్ప) ఇంట్లో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం నిర్వహించడం, కేటీఆర్ హాజరుకావడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థికశాఖ మంత్రి పనిచేసిన హరీష్ రావు ఇంటికి ఉద్యోగసంఘాల నేతలు భేటీ అయి వారి సమస్యలు, టీఏ, డీఏలపై సమస్యలను చర్చించారు. కానీ కేటీఆర్ మాత్రం హాజరుకాలేదు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఉద్యోగ సంఘాల నేతలతోనూ హరీష్ రావు ఇంట్లో తొలి సమావేశం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎందుకు నిర్వహించారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏదైనా పార్టీ కార్యాలయంలోనో లేక నందినగర్ లోని నివాసంలోనో సమావేశం నిర్వహిస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా భేటీ కావడం, ఉద్యోగ సంఘాల నేతలకు దిశానిర్దేశం చేయడం వెనుక అంతర్యమేంటనేది పార్టీలోనే చర్చజరుగుతుంది.

Read Also- Big Breaking: తెలంగాణలో మందుబాబులకు ఉహించని షాక్.. అంతా గందరగోళం

కట్టప్పను శాంతింపజేసేందుకేనా?
బీఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా అధిష్టానం హరీష్ రావును దూరం పెట్టిందనే ప్రచారంజరుగుతుంది. ఆయన ప్రాధాన్యం తగ్గిస్తున్నారని, ఆయన యాక్టీవ్ అయితే.. కేసీఆర్ తనయుడు కేటీఆర్ పార్టీలో కీలక నేతగా మనుగడ కష్టమని భావించి..పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారని సమాచారం. అయితే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కొంత హరీష్ రావు సైతం నైరాశ్యానికి లోనయ్యారనే ప్రచారం జరుగుతుంది. వరంగల్ సభ నుంచి ఇంకా ప్రాధాన్యం తగ్గించారని, దీంతో పార్టీ మారుతున్నారని వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇది నష్టమని భావించిన పార్టీ అధిష్టానం ఆయన పార్టీ మారకుండా కేటీఆర్ ను ఇంటికి పంపించినట్లు సమాచారం. హరీష్ రావును శాంతింపజేయడంతో పాటు కేసీఆర్, పార్టీపై , కేసీఆర్ కుటుంబంపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టినట్లు తెలిసింది. రెండురోజులుగా మీడియా ఫోకస్ అంతా కేటీఆర్, హరీష్ రావు భేటీపైనా పెట్టింది. ప్రభుత్వాని కంటే ఎక్కువగా మైలేజ్ ఇచ్చింది. దీనికి తోడు తామంతా ఒక్కటేననే సందేశం ఇచ్చినట్లు అయింది. పార్టీకేడర్ లోనూ భరోసా ఇచ్చినట్లు అయిందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.

Harish and ktr

రాబోయే లోకల్ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడకుండా..!
రాష్ట్రంలో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గట్టెక్కాలంటే పార్టీలోని నేతలంతా ఐక్యంగా, కోఆర్డినేషన్ అవసరం. లేకుంటే విభేదాలు ఉన్నాయని ప్రజల్లోకి మెసేజ్ వెళ్తే పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వంపై ప్రజల్లో క్రమక్రమంగా పెరుగుతున్న అసంతృప్తి సైతం కలిసి రాదని, నష్టపోతామని, భవిష్యత్‌లో పార్టీకి ఊహించని నష్టం జరుగుతుందని ముందస్తుగానే భావించినట్లు సమాచారం. అందుకే పార్టీ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. అందులో భాగంగానే పార్టీ సీనియర్ నేత హరీష్ రావుతో కేటీఆర్ భేటీ కావడం, రెండ్రోజులపాటు చర్చించడం, మరోవైపు ఉద్యోగసంఘాల నేతలతోనూ భేటీ కావడం ఇప్పుడు హాట్ టాపిక్. పార్టీపై, కుటుంబంపై వస్తున్న ఆరోపణలనుంచి ప్రజలను అటెన్షన్ డైవర్షన్ చేయడంలో కేసీఆర్ వ్యూహం పలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. త్వరలో పార్టీ ప్రజాసమస్యలపై వరుస కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతుందని దీంతో స్థానిక ఎన్నికల ముందు పార్టీని బలోపేతం చేయబోతున్నట్లు పార్టీ సీనియర్ నేతలు తెలిపారు.

Read Also- Kodali Nani: వంశీని చూసి కొడాలి నాని భయపడ్డారా.. వైద్యులే చెప్పారా?

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు