Land Surveyors(image credit:X)
తెలంగాణ

Land Surveyors: సర్వేయర్ పోస్టులకు నామమాత్రంగా దరఖాస్తులు.. ఎంతంటే?

Land Surveyors: భూ సర్వేయర్ పోస్టుల దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది. ఐదు వేల పోస్టులకు దాదాపు 9 వేల మంది దరఖాస్తు చేసినట్లు సమాచారం. వీరిలో అర్హులైన వారిని ఎంపిక చేసి తెలంగాణ సర్వే శిక్షణా అకాడమీలో రెండు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రభుత్వం నుంచి అధికారికంగా లైసెన్స్ లు మంజూరు చేయనున్నారు. ఆ తర్వాత రాష్​ట్రంలో భూ సర్వే మొదలు కానున్నది. భూ సమస్యల పరిష్కారానికి ప్రతి మండలంలో 10 నుంచి 15 మంది చొప్పున సర్వేయర్లను నియమించనున్నారు. క‌ర్ణాట‌క రాష్ట్రంలో విజయవంతంగా అమలైన విధానాన్ని తెలంగాణలో అమలు చేయనున్నారు.

ప్రస్తుతం క‌ర్ణాట‌క రాష్ట్రంలో 6000 మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్లు ,4000 మందిప్రభుత్వ సర్వేయర్లు సేవలందిస్తుండగా, ఒక్కో లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ కు నెలకు సగటున 23 దరఖాస్తులు క్లియర్ చేస్తున్నారు. దీని ద్వారా నెల‌కు రూ. 25 వేల నుండి 30 వేల ఆదాయం లభిస్తుంది.

Also read: Saheli NGO: మహిళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రూ.5 కే సానిటరీ న్యాప్కిన్స్..

మన స్టేట్ లో కూడా లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్లకు ఆ తరహాలోనే ఇన్ కమ్ వచ్చేందుకు ప్రభుత్వం ప్రోత్సహించనున్నది. ఒక్కో అప్లికేషన్ కు సుమారు రూ.1500 మినిమం ఫీజు ఉండేలా రూపకల్పన చేస్తున్నారు. ధరణి కంటే ముందు భూములు, రికార్డుల పరిస్థితి, ఆ తర్వాత సిచ్వేషన్ ను పోల్చుతూ సర్వేయర్లు పూర్తి స్థాయి వివరాలు తయారు చేయడంతో పాటు ల్యాండ్ కు హద్దులు ఎంపిక చేయనున్నారు.ఈ నిర్ణయం రెవెన్యూ శాఖలో కీలక మార్పులకు దారి తీస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

 

 

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!