Actor Tarzan Laxmi Narayana: తెలుగు సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఏం చేసిన, ఏం మాట్లాడిన కూడా క్షణాల్లోనే వైరల్ అవుతోంది. అయితే, ఇటీవలే ఎంతో మంది యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అవుతున్నారు.ప్రస్తుతం, ఈ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా, టాలీవుడ్ విలన్ టార్జాన్ టార్జాన్ లక్ష్మీ నారాయణ ఆయన జీవితంలో జరిగిన విషయాలను చెబుతూ ఏమోషనల్ అయ్యాడు. ఆయన మీద ఎవరో చేతబడి చేసారంటూ .. నమ్మలేని నిజాలను బయట పెట్టాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆసలు ఆయన ఏం చెప్పాడో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: RGV Heroine: నటనకు గుడ్ బై చెప్పి.. సన్యాసిగా మారిన రామ్ గోపాల్ వర్మ హీరోయిన్?
రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ‘గాయం’ అనే చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు టార్జాన్. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎన్నో సినిమాల్లో విలన్‌గా చేసి ఆడియెన్స్ ను మెప్పించాడు. ఎవరో మీ మీద చేతబడి చేశారని మీరు అంతక ముందు చెప్పారు? వాళ్ళు ఎవరో తెలిసిందా అని యాంకర్ అడగగా.. అప్పుడు టార్జాన్ ” ఎవరో ఏంటి.. దగ్గరి బంధువులే ఇలా చేశారని తెలిపాడు. నా మీద ఎవరైతే చేశారో .. వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఒకప్పుడు కాలం వేరు.. ఇప్పుడు వేరు.. ఎవరకైనా చెడు చేయాలని చూస్తే.. కర్మ వెంటనే గట్టిగా కొట్టేస్తాది అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. నేను మాత్రమే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం భరించలేని బాధలు అనుభవించారని అన్నాడు.
Also Read: Konda Surekha: ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతున్న మంత్రి వ్యాఖ్యలు.. కారణం అదేనంటారా!
ఆయన ఇంకా మాట్లాడుతూ ” ఈ రోజుల్లో అందరూ మోసంలోనే బతుకుతున్నారు. మోసం చేసి సంపాదిద్దాం అనే ఆలోచనలోనే ఉన్నారు. ఒక్కరని కాదు.. అందరూ ఇలాగే ఉన్నారు. ఒక నిజాన్ని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. అబద్దాన్ని నిజమని చెబుతున్నారు. అందుకే ప్రకృతి కూడా విలయతాండవం ఆడుతుందని ” ఆయన మాటల్లో చెప్పాడు.