Jayashankar Badibata(image credit;X)
తెలంగాణ

Jayashankar Badibata: స్కూళ్ల రీఓపెన్.. విద్యాశాఖ కీలక నిర్ణయం!

Jayashankar Badibata: రాష్ట్రంలో వచ్చేనెల 12న స్కూళ్లు రీఓపెన్ అవ్వబోతున్నాయి. కాగా అదేరోజు విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అందించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. సర్కారు బడుల్లో ఎన్ రోల్ మెంట్ పెంపు కోసం జూన్ 6 నుంచి 19 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ శనివారం ప్రకటించింది.

వచ్చేనెల 6న గ్రామసభలు నిర్వహించాలని, ఇందులో మహిళా సంఘాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు, స్కూల్ టీచర్లు, హెడ్మాస్టర్, పేరెంట్స్, ఓల్డ్ స్టూడెంట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అంగన్ వాడీ పిల్లలను సర్కారు ప్రైమరీ స్కూళ్లలో చేర్పించేలా ప్లాన్ చేయాలని, ఐదో తరగతి పూర్తయిన విద్యార్థులను ఆరో తరగతిలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

Also read: BJP Politics: హీటెక్కిన రాజకీయాలు.. ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ?

వచ్చేనెల 6న గ్రామ సభ నిర్వహించి, ఎన్ రోల్ మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. ఇందులో మహిళా సంఘాలను, అమ్మ ఆదర్శ పాఠశాలలను, పేరెంట్స్, ఓల్డ్ స్టూడెంట్లు పాల్గొనేలా చూడాలని అధికారులు స్పష్టంచేశారు. 7న ప్రతీ ఇంటిని సందర్శించి, బడీడు పిల్లలను గుర్తించాలని, వీఈఆర్ అప్డేడ్ చేయాలని స్పష్టంచేశారు. 8 నుంచి 10 వరకు కరపత్రాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, అంగన్ వాడీ కేంద్రాలను సందర్శించాలని పేర్కొన్నారు.

డ్రాప్ ఔట్ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని సూచించారు. 11వ తేదీన 6వ తేదీ నుంచి 10 తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్షించాలని స్పష్టంచేశారు. 12న స్కూల్ రీఓపెన్ ను గ్రాండ్ గా నిర్వహించాలని పేర్కొన్నారు. అదేరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని, ప్రజాప్రతినిధులను సైతం ఆహ్వానించాలని తెలిపారు. 13న ప్రైమరీ బడుల్లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం, హైస్కూళ్లలో బాల సభ నిర్వహించాలని సూచించారు.

Also read: YSRCP: ఆ ఒక్క పని చేసుంటే వైసీపీ గెలిచేదా..? ఘోర తప్పిదానికి కారణమెవరు?

16న ఎల్​ఎల్​ఎన్ అండ్ ఎల్ఐపీ దినోత్సవం, 17న విలీన విద్య, బాలికల విద్యాదినోత్సవం నిర్వహించాలని స్పష్టంచేశారు. 18న తరగతి గదుల డిజిటలీకరణపై అవగాహన, మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించాలని, 19న బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించాలని అధికారులు స్పష్టంచేశారు.

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు