BJP Politics(image credit:X)
Politics

BJP Politics: హీటెక్కిన రాజకీయాలు.. ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ?

BJP Politics: రాష్ట్రంలో సమ్మర్ హీట్ కు తోడు పొలిటికల్ హీట్ తోడైంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార పార్టీ కాంగ్రెస్ ను ఢీకొట్టేందుకు బీజేపీ వ్యూహరచన చేపడుతోంది. అందుకు తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడంపై బీజేపీ దృష్టిసారిస్తోంది.

ఈనేపథ్యంలో బీఆర్ఎస్ ను టార్గెట్ గా ఫిక్స్ చేసుకున్నట్లుగా చర్చ జరుగుతోంది. తాజాగా బీజేఎల్పీ నేతల ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా మారాయి. ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది.

కాంగ్రెస్ ను ఢీకొట్టాలంటే ముందు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావించి కారు పార్టీని ఇరకాటంలో పెట్టాలని ప్లాన్ చేసినట్లుగా చర్చించుకుంటున్నారు. గులాబీ పార్టీని డ్యామేజ్ చేసి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకునేందకు ప్లాన్ చేస్తున్నారు.

Also read: Health Cards To Orphans: దేశంలోనే ఫస్ట్ టైమ్.. అనాథలకు ఆరోగ్యశ్రీ కార్డులు!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు దీటుగా బీజేపీ ఫైట్ చేసి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. ఒక తరుణంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? అనే స్థాయికి పార్టీ చేరింది. కానీ ఎలక్షన్ కు కొద్దినెలల ముందు పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా కేవలం 8 అసెంబ్లీ స్థానాలకే పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది.

కానీ ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ నాటికి కమలం పార్టీ పుంజుకుంది. అధికార పార్టీకి ఝలక్ ఇచ్చేలా 8 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. అయితే ఇందులో అభ్యర్థుల కృషి, పార్టీ పనితీరు సంగతి పక్కన పెడితే మోడీ మేనియా విపరీతంగా ఈ ఎలక్​షన్ లో పనిచేసిందనేది బహిరంగ రహస్యమే. ఇదిలా ఉండగా ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మూడింట.. రెండు స్థానాల్లో బీజేపీ విజయం సాధించి ఔరా అనిపించింది.

కానీ ఇటీవల బీఆర్ఎస్ నిర్వహించిన వరంగల్  అనంతరం బీజేపీ గ్రాఫ్ క్రమంగా డౌన్ అయింది. ఓరుగల్లు గడ్డపై బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ సభతో తిరిగి బీఆర్ఎస్ పుంజుకుంది. ఆ సభతో కారు పార్టీకి పాజిటివ్ టాక్ రావడంతో కాషాయ పార్టీ అలర్ట్ అయింది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడంపై ఫోకస్ పెడుతోంది. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందనేందుకు బీఆర్ఎస్ వరంగల్ సభ నిదర్శనంగా నిలిచింది.

Also read: Ponnam Prabhakar: వివక్షకు తావులేకుండా.. పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు..

అందుకే బీఆర్ఎస్ ను లేకుండా చేసి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పాలని నిరూపించాలని చూస్తోంది. భవిష్యత్ లో ఎన్నికలు ఏవైనా పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యే ఉంటుందనేలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తోంది. ఈనేపథ్యంలోనే బీఆర్ఎస్ లో ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అవకాశం వచ్చీ రాగానే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారనే చర్చ జరుగుతోంది. అందుకే బీఆర్ఎస్ ఎల్పీలో చీలికలు అంటూ హాట్ కామెంట్స్ చేశారని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీఆర్ఎస్ ను టార్గెట్ గా చేసుకున్న కమలం పార్టీ వ్యూహం ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.

 

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!