Allu Aravind Sons
ఎంటర్‌టైన్మెంట్

Allu Aravind: అల్లు అరవింద్‌కు ముగ్గురు కాదు.. నలుగురు కుమారులని తెలుసా?

Allu Aravind: మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పేరు వినబడితే చాలు, ఆయనదొక మాస్టర్ మైండ్ అని అంతా భావిస్తుంటారు. టెక్నాలజీకి అనుగుణంగా పరుగులు పెట్టడంలో, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో అల్లు అరవింద్ తర్వాతే ఎవరైనా. అందుకే ఆయనకు సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ నిర్మాతలలో ఒకరిగా ఆయన ఇంకా కొనసాగుతున్నారంటే, అందుకు కారణం టెక్నాలజీతో పాటు ఆయన, ఆయన ఆలోచనలు మారుతుండటమే. అయితే సినిమాల పరంగా ఇంతటి సక్సెస్ ఉన్న అల్లు అరవింద్‌కు పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఆయన భారీ లాస్ అయ్యారనే విషయం చాలా మందికి తెలియదు. అవును, అల్లు అరవింద్ పర్సనల్ లైఫ్‌లో ఒక విషాద వార్త ఉంది. అది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అదేంటంటే..

Also Read- Naa Anveshana: రాత్రి కూడా వచ్చింది.. శ్రీముఖి బండారం బయటపెట్టేశాడు!

అందరూ అల్లు రామలింగయ్య కొడుకు అల్లు అరవింద్‌కు ముగ్గురు కొడుకులనే భావిస్తారు. అల్లు వెంకటేష్(అల్లు బాబీ), అల్లు అర్జున్ (Allu Arjun), అల్లు శిరీష్ మాత్రమే అల్లు అరవింద్ కొడుకులని అందరికీ తెలుసు. ఈ ముగ్గురు కాకుండా ఆయనకు ఇంకో కుమారుడు కూడా ఉన్నారు. పేరు అల్లు రాజేష్. అల్లు వెంకటేష్‌కు, అల్లు అర్జున్‌కు మధ్యలో జన్మించిన అల్లు రాజేష్ అంటే.. అల్లు అరవింద్‌కు ఎంతో ఇష్టమట. కానీ, విధి ఆడిన వింత నాటకంలో అల్లు రాజేష్ ప్రాణాలను కోల్పోయారు. ఒక రోడ్డు యాక్సిడెంట్‌లో అల్లు ఫ్యామిలీ అల్లు రాజేష్‌ని కోల్పోయిందని.. వేరెవరో కాదు.. అల్లు శిరీష్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూ‌లో ఎమోషనలవుతూ చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి అల్లు అరవింద్ తన కుమారుల విషయంలో ఎంతో కేరింగ్‌గా ఉండేవారని తెలిపారు. విచిత్రం ఏమిటంటే.. అల్లు శిరీష్ పుట్టకముందే అల్లు రాజేష్ చనిపోయారట. మళ్లీ చాన్నాళ్ల తర్వాత అల్లు శిరీష్‌ చెప్పిన ఈ విషయాలు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుండటంతో.. అందరికీ ఈ విషయం తెలుస్తుంది.

Also Read- Vishal marriage: విశాల్ పెళ్లి ప్రకటన వచ్చేది ఆరోజే.. వధువు ఎవరో తెలుసా?

నిజంగా అల్లు రాజేష్ ఉండి ఉంటే.. అల్లు అర్జున్ కంటే ముందే పెద్ద హీరో అయ్యేవాడేమో. అప్పుడు అల్లు అర్జున్ సినీ అరంగేట్రం చేయకుండా బిజినెస్ వ్యవహారాలు చూసుకునే వాడేమో అనేలా కొందరు కామెంట్స్ చేస్తుంటే… తలరాతను ఎవరూ మార్చలేరు, ఐకాన్ స్టార్ ఒక్కడే అంటూ అల్లు ఆర్మీ సమాధానం ఇస్తున్నారు. ఏది ఏమైనా అల్లు ఫ్యామిలీకి మాత్రం ఇది తీరని లాస్ అని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఇప్పటి వరకు ఎక్కడా రివీల్ చేయకపోవడం విశేషం. వాస్తవానికి అల్లు రామలింగయ్య తన కుమారుడు అల్లు అరవింద్‌ని పెద్ద హీరోని చేయాలని చూశారు. అప్పట్లో రెండు మూడు సినిమాలలో కూడా ఆయన నటించారు. కానీ, నటన ఆయనకు వర్కవుట్ కాలేదు. అప్పుడు గీతా ఆర్ట్స్ సంస్థను స్థాపించి, అల్లు అరవింద్‌ని నిర్మాతను చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి సినిమాలే ఎక్కువగా నిర్మాణం జరుపుకున్నాయి. అప్పటి నుంచి చిరు, అరవింద్‌‌ల అనుబంధం చాలా స్ట్రాంగ్‌ అయింది. ఇప్పటి వరకు అది కొనసాగుతూనే ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ