BRS Sliver Jublee Celebrations ( image credit: twitter)N
తెలంగాణ

BRS Sliver Jublee Celebrations: అమెరికాలో బీఆర్ఎస్ రజతోత్సవాలు.. డల్లాస్ నుంచి మొదలు!

BRS Sliver Jublee Celebrations: అమెరికాలోని డల్లాస్‌లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ను జూన్ 1న నిర్వహిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించేందుకు పార్టీ అమెరికా విభాగం సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. అమెరికాలోని తెలంగాణ సంఘాలు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ఒక వేదికపైకి తీసుకురావడంతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, పార్టీ లక్ష్యాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడనున్నాయి. ఈ గ్రాండ్ ఈవెంట్‌ను విజయవంతం చేయడానికి బీఆర్‌ఎస్ అమెరికా విభాగం ఇప్పటికే లాస్ ఏంజెలిస్, కాలిఫోర్నియా, అట్లాంటా, జార్జియా, వాషింగ్టన్ డీసీ వంటి నగరాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించింది.

డల్లాస్ ఈవెంట్‌కు సంబంధించిన ప్రచార వ్యూహాలు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై చర్చించారు. మాజీ ఎంపీ బాల్క సుమన్ స్థానిక కార్యకర్తలు, ఎన్నారైలతో సమన్వయం చేస్తున్నారు. లాజిస్టిక్స్, రవాణా వంటి ఏర్పాట్లపై దృష్టి, సోషల్ మీడియా ప్రచారం, సాంస్కృతిక కార్యక్రమాలు, మీడియా సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. రానున్న 15రోజుల్లో అమెరికాలోని ఇతర కీలక నగరాలు, రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ స్థానిక విభాగాలు సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు.

 Alos Read: High Court Verdict: కల్తీ కల్లు తయారీ కేసుపై.. హైకోర్టు కీలక తీర్పు!

తెలంగాణ సంఘాలు, మద్దతుదారుల్లో ఉత్తేజాన్ని పెంపొందించేందుకు మద్దతుదారులు కృషి చేయనున్నారు. న్యూజెర్సీ, బే ఏరియా (కాలిఫోర్నియా), చికాగో, హ్యూస్టన్, డల్లాస్, న్యూయార్క్ వంటి నగరాల్లో ఈ సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు బీఆర్‌ఎస్ యుఎస్‌ విభాగం వెల్లడించింది.

తెలంగాణ సింహగర్జనకు 24ఏళ్లు
దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర సాధనకు పునాది వేసిన “తెలంగాణ సింహగర్జన”కు సరిగ్గా 24 ఏళ్లుఅని కేటీఆర్ అన్నారు. శనివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కరీంనగర్ వేదికగా ఉద్యమ రథసారథి కేసీఆర్ ఆనాడు పూరించిన సమరశంఖం ఢిల్లీ వరకూ ప్రతిధ్వనించిన అపూర్వ సందర్భమది అన్నారు. తెలంగాణ నలువైపుల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన ఆ జనప్రవాహం.. ఓ సముద్రాన్నే తలపించిన చారిత్రక సన్నివేశమది అన్నారు.

Also Read: Maheshwar Reddy On BRS: త్వరలో కవిత తిరుగుబాటు.. హరీష్‌కు రేవంత్ సపోర్ట్.. బీజేపీ నే

తెలంగాణ వచ్చేదా సచ్చేదా అని ఎంతో మంది అడుగడుగునా అవమానించినా, రకరకాలుగా అవహేళన చేసినా వెన్నుచూపని ఆ ధీరోదాత్తుడి సంకల్పం ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే ఓ చెరగని సంతకం అన్నారు. ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, ఒక్కరితో మొదలైన ఆనాటి ప్రయాణం అనుకున్న గమ్యాన్ని ముద్దాడటమే ఒక చారిత్రక విజయమైతే.. ఇక ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడై, సాధించిన తెలంగాణను పదేళ్లలోనే దేశానికే దారిచూపి దీపస్తంభంలా తీర్చిదిద్దిన ఆ దార్శనికత.. ప్రతి తెలంగాణ బిడ్డకు ఎప్పటికీ గర్వకారణం అన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే