Vishal Marriage: కోలీవుడ్ హీరో విశాల్‌కు సంబంధించి ఈ మధ్య వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. అప్పుడెప్పుడో ఆయన నటించిన సినిమా ‘మదగజరాజ’, రీసెంట్‌గా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో విశాల్‌ను చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆయనకు ఏదో వ్యాధి సోకిందని, అందుకే అలా గజగజా వణికిపోతున్నాడని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఆయనకు ఏదో జ్వరం అని చెప్పి కవర్ చేశారు. రెండు రోజుల క్రితం కూడా విశాల్ ఓ వేడుకలో సడెన్‌గా పడిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో విశాల్ ఆరోగ్యంపై మరింతగా వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఆయన భోజనం చేయకుండా రావడంతో అలా జరిగిందని మరోసారి కవర్ చేశారు. ఇలా కవర్ చేస్తున్నారు తప్పితే.. అసలు విశాల్‌కు ఏమైందో మాత్రం చెప్పడం లేదు. ఇప్పుడేమో విశాల్ పెళ్లికి తొందరపెడుతున్నారు.
Also Read- Oh Bhama Ayyo Rama: పెళ్లిపై అదిరిపోయే సాంగ్.. ఇక మోత మోగిపోతుందేమో!
వాస్తవానికి విశాల్ పెళ్లికి సంబంధించి ఇప్పుడు కాదు, దాదాపు 10 సంవత్సరాల క్రితం నుంచి వార్తలు వినబడుతూనే ఉన్నాయి. నటి వరలక్ష్మీ శరత్ కుమార్‌తో ఆయన నడిపిన ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు కూడా. అది కూడా నడిఘర్ సంఘం భవనం ఎప్పుడైతే పూర్తవుతుందో, అందులో జరిగే మొట్టమొదటి పెళ్లి తమదే అని విశాల్, వరలక్ష్మీ అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో, బ్రేకప్ చెప్పేసుకున్నారు. ప్రస్తుతం వరలక్ష్మీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. విశాల్ మాత్రం రోజు రోజుకీ బలహీన పడిపోతూ, పేషెంట్‌గా మారిపోతున్నారు. అన్నట్టు వరలక్ష్మీతో బ్రేకప్ తర్వాత, విశాల్‌కు వేరొక అమ్మాయితో నిశ్చితార్థం కూడా అయింది. అది కేవలం నిశ్చితార్థం దగ్గరే ఆగిపోయింది. ఆ తర్వాత ముందుకు కదలలేదు. మళ్లీ ఇన్నాళ్లకు విశాల్ పెళ్లి గురించి కోలీవుడ్ మీడియా మాట్లాడుకుంటోంది.
Also Read- Mega157: చిరు, అనిల్ రావిపూడి చిత్ర హీరోయిన్ ఫిక్స్.. మరోసారి టాలీవుడ్‌ని రూల్ చేసేందుకు వస్తోంది
కారణం స్వయంగా విశాలే తన పెళ్లి గురించి ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన మాట ఇచ్చినట్లుగా నడిఘర్ సంఘం భవన నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తవుతుందట. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ భవన ప్రారంభోత్సవం నిర్వహించాలని చూస్తున్నామని విశాల్ తెలిపినట్లుగా టాక్ నడుస్తుంది. ‘‘ఆగస్ట్ 15 భవనాన్ని ప్రారంభించుకుని, ఆ తర్వాత ఆగస్ట్ 29 నా పుట్టినరోజున పెళ్లికి సంబంధించి ప్రకటన చేస్తాను. ప్రేమ వివాహామే చేసుకుంటున్నాను. కొన్ని నెలలుగా నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. నా ప్రేయసి ఎవరనేది త్వరలోనే అందరికీ చెబుతాను. 21 ఏళ్ల నా సినీ కెరీర్‌లో ప్రేక్షకులు ఎప్పుడూ అండగా నిలబడ్డారు. వారే నా ఆస్తి. వారు ఆదరించారు కాబట్టే, నేను ఇంకా నటుడిగా కొనసాగుతున్నాను. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని విశాల్ తెలిపినట్లుగా కోలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తుంది. మరోవైపు విశాల్ తనతో కలిసి నటించిన ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నారని, ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నారనేలా కూడా కోలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. విశాల్‌తో సినిమా తర్వాత ఆమె పెద్దగా సినిమాలు చేయలేదు. ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా కూడా కొనసాగడం లేదని అంటున్నారు. మరి విశాల్ పెళ్లి చేసుకోబోయే ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే మాత్రం, ఆయన చెప్పినట్లుగా ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు