Oh Bhama Ayyo Rama: పెళ్లిపై అదిరిపోయే సాంగ్.. ఇక మోతే!
Oh Bhama Ayyo Rama Pelli Song
ఎంటర్‌టైన్‌మెంట్

Oh Bhama Ayyo Rama: పెళ్లిపై అదిరిపోయే సాంగ్.. ఇక మోత మోగిపోతుందేమో!

Oh Bhama Ayyo Rama: పెళ్లిపై ఇప్పటి వరకు ఎన్నో పాటలు వచ్చాయి. వాటిలో ‘శ్రీరస్తు, శుభమస్తు.. శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం’, ‘అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి’ పాటలను బీట్ చేసే పాట ఇప్పటి వరకు అయితే రానే రాలేదని చెప్పుకోవాలి. ఇప్పుడు యంగ్ హీరో సుహాస్ అలాంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నాడు. పెళ్లిపై అదిరిపోయే సాంగ్‌‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ పాటలను బీట్ చేస్తుందో, లేదో తెలియదు కానీ, చక్కని సాహిత్యంతో వచ్చిన ఈ పాట కూడా మంచి ఆదరణను పొందుతుందన్నది మాత్రం నిజం. ఎందుకంటే ఈ పాటకు అంత మంచి సాహిత్యం కుదిరింది. కచ్చితంగా పెళ్లి పాటల్లో ఇకపై ఈ పాట ఉంటుందనిపించేలా ఈ పాటను పిక్చరైజ్ చేశారు. విషయంలోకి వస్తే..

Also Read- Mega157: చిరు, అనిల్ రావిపూడి చిత్ర హీరోయిన్ ఫిక్స్.. మరోసారి టాలీవుడ్‌ని రూల్ చేసేందుకు వస్తోంది

సినిమా సినిమాకు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న హీరో సుహాస్‌ (Hero Suhas). తాజాగా ఆయన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మలయాళంలో ‘జో’ అనే చిత్రంలో నటించి, అందరి మనసులను దోచుకున్న నటి మాళవిక మనోజ్ ఈ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకత్వంలో వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. భళ్లాలదేవుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) తన స్పిరిట్ మీడియా ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ చిత్రం నుంచి ‘రామచంద్రుడే’ అంటూ కొనసాగే అందమైన పెళ్లి సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Samantha: సమంత రెండో పెళ్లి.. కొత్త ఇల్లు? కుండబద్దలు కొట్టిన మేనేజర్!

హీరో, హీరోయిన్లపై సాంప్రదాయ పద్ధతిలో ఎంతో బ్యూటీఫుల్‌గా చిత్రీకరించిన ఈ పెళ్లి సాంగ్‌ (Wedding Song)కు శ్రీ హర్ష ఈమని, పార్థు సన్నిధిరాజు సాహిత్యం అందించగా.. టిప్పు అండ్‌ హరిణి టిప్పు ఈ సాంగ్‌ను ఆలపించారు. రథన్‌ ఈ పాట కలకాలం గుర్తిండిపోయేలా స్వరాలను సమకూర్చారు. ఈ పాట విడుదల సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఈ పెళ్లి పాట అందరి హృదయాలకు హత్తుకునేలా ఉంటుంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో వచ్చిన ఉత్తమమైన పెళ్లి పాటల్లో తప్పకుండా మా ‘రామచంద్రుడే’ సాంగ్‌ కూడా ఉంటుందని భావిస్తున్నాం. రథన్‌ ఈ లవ్‌స్టోరీకి చాలా మంచి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో ఉన్న ఆరు పాటలు వేటికవే అనే విధంగా ఎంతో బ్యూటీఫుల్‌గా ఉంటాయి. ముఖ్యంగా ఈ పెళ్లి పాట అందరికి ఎంతగానో నచ్చుతుందని తెలపగా, నిర్మాత హరీష్‌ మాట్లాడుతూ.. బెస్ట్‌ క్వాలిటీ‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం, త్వరలోనే రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని అన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ అతిథి పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు బ్రహ్మా కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా, మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..