Konda Surekha (imagecredit:swetcha)
Politics

Konda Surekha: ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతున్న మంత్రి వ్యాఖ్యలు.. కారణం అదేనంటారా!

Konda Surekha: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తరచూగా కాంట్రవర్సీ అవుతూనే ఉన్నాయి. ఆమె సందర్భాను సారంగా చేయడం లేదా? సలహాలు ఇచ్చేవారు సరిగ్గా గైడ్ చేయడం లేదా? తెలీదు కానీ చేసే వ్యాఖ్యలు మాత్రం రాజకీయ రచ్చకు దారితీస్తున్నాయి. ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారుతున్నాయి. సొంతపార్టీ నేతల నుంచి కూడా కొన్ని సందర్భాల్లో విమర్శలు వస్తున్నాయి. మంత్రిగా ఉండి ఎందుకు అలా మాట్లాడుతున్నారనేది రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.

రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రి కొండా సురేఖ కీలకంగా ఉన్నారు. ఆమె ఈ నెల 15న వరంగల్‌లోని కృష్ణాకాలనీలో బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి ఓ ఫార్మా కంపెనీ ముందుకు రాగా మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడుతూ,‘క్లియరెన్స్ కోసం మంత్రుల వద్దకు కొన్ని ఫైల్స్ వస్తుంటాయి. మామూలుగా మంత్రులు అలాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తుంటారు. మేం మాత్రం మాకు నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. సామాజిక బాధ్యతగా స్కూల్‌ను అభివృద్ధి చేయాలని’ కోరామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారితీశాయి. వివాదాస్పదం అయ్యాయి. ఎందుకు ఆమె ఇలా మాట్లాడాల్సి వచ్చిందనేది చర్చకు దారితీసింది.

Also Rerad: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. ఇప్పుడైనా బయటికొస్తారా?

నాగచైతన్య-సమంత విడాకుల విషయం

ఆమె ఉద్దేశమేంటీ.. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో భాగంగా చేశారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గతంలోనూ నాగచైతన్య-సమంత విడాకుల విషయంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. నాగార్జున కోర్టుకు వెళ్లడం, కేటీఆర్ సైతం లీగల్ నోటీసు ఇచ్చారు. గీసుకొండ మండలంలో ఎస్ఐ కూర్చీలో కూర్చోవడం వివాదాస్పదం అయింది. రాజన్నకోడెలు ఒకే వ్యక్తికి మంత్రి ఆదేశాలతోనే ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కాంగ్రెస్ పార్టీలోనూ కలవరానికి గురిచేస్తుంది. మంత్రి సురేఖ చేస్తున్న వ్యాఖ్యలపై సొంతపార్టీ నేతలే మండిపడుతున్నారు.

మంత్రి చేసే వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వ్యాఖ్యలను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వైరల్ చేస్తూ రేవంత్ సర్కార్ లోని మంత్రుల పని తీరు, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి ఇదే సాక్ష్యం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. బీజేపీ సైతం తనదైశీలో విమర్శలు చేస్తుంది. అయితే సురేఖ ఇలా వరుసగా ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆ తర్వత నా ఉద్దేశం అది కాదు అంటూ సంజాయిషీలు చెప్పుకోవడం, క్షమాపణలు చెబుతున్నారు. ఆమెకు అలవాటులో పొరపాటుగా మారిపోయిందా అంటూ సొంత పార్టీల నేతలు సైతం మంత్రిపై గుర్రుగా ఉన్నారు.

Also Read: Janasena: పుంజుకుంటున్న బీజేపీ.. మంత్రి పదవికే అంకితమైన పవన్.. జనసేనకు ఎందుకీ గతి?

 

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..